Nitin Gadkari: ఈ ఏడాది చివరకల్లా దేశంలోని జాతీయ రహదారులపై గుంతలు లేకుండా చేస్తామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిష్ గడ్కరీ చెప్పారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక విధివిధానాలను సిద్ధం చేస్తున్నందని వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని 1,46,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల మ్యాపింగ్ పూర్తైందని తెలిపారు. ఏడాది చివరి నాటకిి గుంతలను తొలగించేందుకు పర్ఫామెన్స్ బెస్డ్ మెయింటనెన్స్, స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందాలను పటిష్టం చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల కార్యదర్శి అనరాగ్ జైన్ తెలిపారు.
బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్(BOT) మోడ్ లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు గురువారం గడ్కరీ తెలిపారు. సాధారణంగా రోడ్ల నిర్మాణం మూడు పద్ధతుల్లో జరుగుతాయి. బీఓటీ, ఇంజనీరింగ్-ప్రొక్యూర్మెంట్ అండ్ కన్ట్రక్షన్(EPC), హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(HAM) మోడళ్లలో రోడ్ల నిర్మాణం జరుగుతుంది.
Read Also: Congress: కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, రోహిత్, వేముల వీరేశం.. పలువురు నేతలు
EPC మోడ్‌లో నిర్మించబడిన రోడ్‌లకు చాలా ముందుగానే నిర్వహణ అవసరమవుతుంది, అయితే BOT మోడ్‌లో, కాంట్రాక్టర్‌కు రాబోయే 15-20 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది, దీంతో రోడ్లు నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తారు. దీంతో BOT మోడ్ లో రోడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ చెప్పారు. వర్షాల వల్ల హైవేలు దెబ్బతింటాయని, గుండలు ఏర్పడుతాయని పేర్కొన్న గడ్కరీ, జాతీయ రహదారులపై మంత్రిత్వ శాఖ భద్రతా ఆడిట్ చేస్తోందని వెల్లడించారు.
జాతీయ రహదారులపై గుంతలు లేకుండా ఉండేలా పాలసీని రూపొందిస్తున్నామని, ప్రాజెక్టు విజయవంతానికి యువ ఇంజనీర్లను కలుపుకుపోతామని అన్నారు. BOT ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడీదారులు 20-30 ఏళ్ల రాయితీ వ్యవధిలో హైవే ప్రాజెక్టులను ఫైనాన్సింగ్, బిల్డింగ్, ఆపరేటింగ్ రిస్క్ తీసుకుంటారు. డెవలపర్లు యూజర్ ఛార్జీలు, టోల్ ద్వారా పెట్టుబడుల్ని తిరిగి పొందుతారు. EPC ప్రాజెక్టుల్లో హైవేలను నిర్మించడానికి ప్రభుత్వం డెవలపర్లకు డబ్బు చెల్లిస్తుంది. ఆ తర్వాత టోల్ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.