NTV Telugu Site icon

Madhya Pradesh: నిందితుడిని విడిచిపెట్టొద్దు.. గిరిజనుడిపై మూత్రవిసర్జన ఘటనపై సీఎం ఆదేశాలు

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితుడిపై మూత్రవిసర్జన ఘటన రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అతడిని విడిచిపెట్టదని, నిందితులను శిక్షించడం ప్రతీ ఒక్కరికి నైతిక పాఠంగా మారుతుందని ఆయన అన్నారు.

Read Also: Madhya Pradesh: దారుణం.. గిరిజనుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన..!

భోపాల్‌లో మీడియాతో మాట్లాడిన సిఎం చౌహాన్.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నేను ఆదేశించాను, ఇది ప్రతి ఒక్కరికీ నైతిక పాఠం కావాలి, మేము అతనిని విడిచిపెట్టము, నిందితుడికి మతం, కులం లేదా పార్టీ లేదని అన్నారు. మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఒక గిరిజన వ్యక్తిపై మూత్రవిసర్జన చేసినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో సీఎం ఆదేశాల మేరకు జాతీయ భద్రతా చట్టం కింద యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. ఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

జిల్లాలోని కుబ్రి గ్రామంలో ఈ సంఘటన జరిగింది మరియు వైరల్ వీడియోలో నిందితుడు మద్యం మత్తులో వ్యక్తి ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు చూపిస్తుంది. నిందితుడిని కుబ్రి గ్రామానికి చెందిన ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. బాధితుడిని జిల్లాలోని కరౌండి గ్రామానికి చెందిన దస్మత్ రావత్ (36)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోొ తెగ వైరల్ అయ్యాయి. సీఎం ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్లు 294, 504, సెక్షన్ 3(1) (r)(లు) కింద జిల్లాలోని బహారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.