NTV Telugu Site icon

Justin Trudeau: “నువ్వో చెత్త ప్రధానివి”..కెనడా ప్రధానిపై పౌరుడి ఆగ్రహం..

Justin Trudeau

Justin Trudeau

Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య విషయంలో భారత్‌పై అనవసర ఆరోపణలు చేసి దౌత్య సంబంధాలను దెబ్బతిన్నాకున్నాడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇప్పటికే భారత ఆగ్రహం చవిచూసిన ట్రూడో, అక్కడి స్థానికుల నుంచి కూడా మద్దతు కోల్పోతున్నాడు. తాజాగా ఓ కెనడియన్, ప్రధానిని అందరి ముందు తిట్టాడు, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. దేశంలో హౌసింగ్ సంక్షోభం, కార్బన్ పన్నులపై ప్రశ్నించాడు.

సాధారణ పౌరుడి నుంచి కెనడా ప్రధానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రూడో తన మద్దతుదారులతో చేయి ఊపుతూ కరచాలనం చేస్తూ వస్తున్న సమయంలో.. ఓ వ్యక్తిని ట్రూడో ఎలా ఉన్నావ్..? అని పలకరించాడు. సదరు వ్యక్తి ట్రూడోతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సమ్మతించలేదు.

Read Also: Nobel Peace Prize: ఇరాన్ హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి..

నేను మీకు కరచాలనం చేయను, మీరో చెత్త ప్రధాని అని తిట్టాడు. దీంతో ఆశ్చర్యపోయిన ట్రూడో ఎందుకు సార్..? అని ప్రశ్నించగా.. నువ్వు దేశాన్ని నాశానం చేశావు, కెనడాలో ఎవరైనా ఇళ్లు కొనగలరా..? అని అక్కడి హౌసింగ్ సంక్షోభాన్ని గురించి ప్రశ్నించారు. మీరు ఈ పన్నులను ఉక్రెయిన్ కి పంపిస్తున్నారంటూ సదరు వ్యక్తి మండిపడ్డారు. అయితే ప్రధాని ట్రూడో ఆ వ్యక్తి వాదనలి రష్యన్ ప్రచారంగా కొట్టిపారేశాడు. మీరు పుతిన్ చెబుతున్నది వింటున్నారని మండిపడ్డాడు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్‌పై ఆరోపణలు చేశారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించాడు. దీని తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం చెలరేగింది. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఇండియా ఓ అడుగు ముందుకేసి దౌత్యవేత్తల విషయంలో ఇరు దేశాలు సమానంగా ఉండాలని చెబుతూ.. భారత్ లోని 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు సూచించింది.