Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాలీ మాట్లాడే మియా ముస్లింలు అస్సాం రాష్ట్రాన్ని ఆక్రమించుకోనివ్వమని ఆయన అన్నారు. మైనారిటీ ఓట్ల కోసం తాను పోటీలో లేనని చెప్పారు. నాగావ్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తీసుకొచ్చిన వాయిదా తీర్మానాలపై అసెంబ్లీలో శర్మ మాట్లాడారు. ఈ తీర్మానాలపై ఆయన సమాధామిస్తూ.. జనాభా పెరుగుదలని పరిగణలోకి తీసుకుంటే నేరాల సంఖ్య పెరగలేదని అన్నారు. సీఎం అటాక్‌తో కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
Read Also: Ram Mohan Naidu: ఏపీలో నూతన విమానాశ్రయాలు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
సీఎం బెంగాలీ ముస్లింలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘‘దిగువ అస్సాం నుండి ప్రజలు ఎగువ అస్సాంకు ఎందుకు వెళ్తున్నారు? తద్వారా మియా ముస్లింలు అస్సాంను స్వాధీనం చేసుకోగలరు? మేము దానిని జరగనివ్వము’’ అని అన్నారు. ‘మియా’ అనే పదం బెంగాలీ మూలానికి చెందిన ముస్లింలను సూచిస్తుంది, వీరు బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులుగా అస్సాంలోకి ప్రవేశిస్తున్నారని తరుచూ ఆరోపణలు వస్తున్నాయి.
