Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Reservation Bill History: భారతదేశంలో మహిళా రిజర్వేషన్ ప్రయాణం దాదాపు ఏడున్నర దశాబ్దాల చరిత్ర కలిగినది. స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ సభలో జరిగిన చర్చల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం.. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే స్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ 1992లోనే రాజ్యాంగ సవరణల ద్వారా అమల్లోకి వచ్చింది. అయితే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే బిల్లుకు చట్టపరమైన ఆమోదం లభించడానికి 2023 వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.
1996లో తొలిసారి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు 1996 సెప్టెంబర్‌లో అప్పటి హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం గీతా ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపించారు. అయితే లోక్‌సభ రద్దు కావడంతో ఆ బిల్లు ఆమోదం పొందకుండానే ముగిసిపోయింది.
Also Read
- Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
- Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
- MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
- Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలోనూ అడ్డంకులు
అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రయత్నించింది. 1998, 1999, 2003 సంవత్సరాల్లో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇతర వెనుకబడిన తరగతుల (OBC) మహిళలకు ప్రత్యేకంగా ఉపకోటా కల్పించాలన్న డిమాండ్‌తో పాటు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బిల్లు ముందుకు సాగలేదు.
2008లో మళ్లీ బిల్లు.. 2010లో రాజ్యసభ ఆమోదం
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2008 మేలో మహిళా రిజర్వేషన్ బిల్లును 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 2010 మార్చి 9న తీవ్ర గందరగోళం మధ్య రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ఇది కీలక ముందడుగుగా నిలిచింది. అయితే, అప్పటి మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టలేకపోయారు. 2014లో 15వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లు కూడా కాలపరిమితి ముగిసిపోయింది.
2023లో నారీ శక్తి వందన్ అధినియం.. రాష్ట్రపతి ఆమోదం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లో మరోసారి ప్రాణం పోసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన తొలి ప్రత్యేక సమావేశాల్లో భాగంగా 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి ‘నారీ శక్తి వందన్ అధినియం’ అని పేరు పెట్టారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన అనంతరం 2023 సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ఆమోదం లభించింది.
ఈ చట్టం ప్రకారం
లోక్‌సభలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయాలి.
రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
ఢిల్లీ శాసనసభలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఈ రిజర్వేషన్ 15 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా నిబంధన రూపొందించారు.
జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అనంతరం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఎప్పటి నుంచి?
పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ కోసం దశాబ్దాల పాటు పోరాటం సాగినప్పటికీ, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ముందుగానే అమల్లోకి వచ్చింది. 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు కనీసం మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేశారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ స్థాయిలో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది.
భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మహిళా రిజర్వేషన్ చట్టం కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళల సంఖ్య పెరగడం ద్వారా విధాన రూపకల్పనలో వారి పాత్ర మరింత బలపడుతుందని ఆశిస్తున్నారు. 1996లో ప్రారంభమైన బిల్లుపై చర్చలు, 2010లో రాజ్యసభ ఆమోదం, చివరకు 2023లో రాష్ట్రపతి ఆమోదం.. మహిళా రాజకీయ ప్రాతినిధ్యం కోసం సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్‌కు మళ్లీ కెప్టెన్సీ..
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!