NTV Telugu Site icon

Women Reservation Bill: చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం..

Women Reservation Bill

Women Reservation Bill

Women Reservation Bill: చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల పార్లమెంట్ లోని ఉభయసభలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ బిల్లు లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తుంది. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కలిపిస్తుంది. అయితే ఈ బిల్లు 2029 ఎన్నికల్లో అమలులోకి వస్తుందని కేంద్రం చెప్పింది.

Read Also: ISKCON: బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి రూ.100 కోట్ల నోటీసులు పంపిన ఇస్కాన్..ఎందుకంటే..?.

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ఈ రోజు తెల్లవారుజామున మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంతకం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం సమర్పించారు. రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారింది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రవేశపెట్టింది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోని సభ మారిన రోజున ఈ బిల్లును తీసుకువచ్చింది. లోక్‌సభలో ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎంపీలు తప్పా లోక్‌సభ, రాజ్యసభ ఏకాభిప్రాయంతో బిల్లుకు మద్దతు తెలిపాయి.

మహిళా రిజర్వేషన్ చట్టం జనాభా లెక్కల ప్రకారం లోకసభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ తర్వాత అమలులోకి వస్తుందని. అంటే 2029 ఎన్నికల్లో మాత్రమే ఈ చట్టం అమలులోకి వస్తుంది. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించకుండా సమ్మిళిత సమాజం, ప్రజాస్వామ్య సమైక్యత గురించి మాట్లాడలేమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.