NTV Telugu Site icon

Bhopal: బాబోయ్ వీళ్లు లేడీలా రౌడీలా.. నడిరోడ్డుపై ఏంటీ దారుణం

Bhopal

Bhopal

Bhopal: నడిరోడ్డుపై మద్యంమత్తులో యువకులు గొడవలు పడటం సహజం. ఒకరిపై కొరు దాడి చేసుకోవడం మనం చూస్తుంటాము. అయితే మగవారికి ఏమాత్రం తగ్గమంటూ నలుగురు మహిళలు రోడ్డున పడ్డారు. ఏకారణం లేకుండా ఓమహిళపై దాడి చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో, LIG ​​కూడలి వద్ద ఒక మహిళపై నలుగురు అమ్మాయిలు దాడి చేసిన సంచళనంగా మారింది. నడిరోడ్డుపై తప్పతాగి ఓ మహిళపై కిరాతకంగా దాడి చేశారు. అయితే అక్కడున్న వారు భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. వారి మధ్యలో వెళ్లేందుకు భయపడేంతగా ఆమహిళపై దాడిచేస్తుండటంతో కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంత అర్థరాత్రి నడిరోడ్డపై జరుగుతున్న అక్కడ పోలీసులు లేకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 4 న అర్థరాత్రి ఒంటిగంట సమయంలో నలుగురు అమ్మాయిలు ఫుల్‌గా మద్యం సేవించారు. ఇండోర్ జిల్లాలో, LIG ​​కూడలి వద్దకు రాగేనే ఏమైందో తెలియదు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు బెల్టుతో దారుణంగా కొట్టరు. ఆమెను కాళ్లతో కడుపు మీద దాడి చేశారు. జుట్టుపట్టుకొని కిరాతకంగా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. హింసాత్మకంగా కొట్టడం,దుర్భాషలాడడం ఈవీడియోలో మీరు చూడవచ్చు.

Read also: Samantha: ప్రస్తుతానికి నేను చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత

దాడి చేసిన వారు మేఘా మాల్వియా, టీనా సోని, పూనమ్ అహిర్వార్, అనే మహిళలు.. మరో వ్యక్తి తనపై కారణం లేకుండా దాడి చేశారని బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు ఎంఐజీ పోలీస్ స్టేషన్ సూపర్‌వైజర్ అజయ్ వర్మ తెలిపారు. కారణం ఏంటిని ఇంకా తెలియనందున, ఈ సంఘటన మరోసారి విస్తృతంగా పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Show comments