Site icon NTV Telugu

Delhi Metro Rail: మెట్రోరైలులో సీటు కోసం గొడవ.. కోపంలో మహిళ ఏం చేసిందంటే?

Delhi Metro Pepper Spray

Delhi Metro Pepper Spray

Woman Uses Pepper Spray On Co-Passenger After Argument Escalates In Delhi Metro: ఆ మెట్రో రైలు చాలావరకు ఖాళీగానే ఉంది. కూర్చోవడానికి సీట్లు కూడా ఉన్నాయి. అయినా సరే.. ఆ ఇద్దరు మహిళలు మాత్రం సీటు విషయంలో గొడవ పడ్డారు. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. కోపంలో ఒక మహిళ తనతో వాగ్వాదానికి దిగిన మహిళపై పెప్పర్ స్ర్పే కొట్టింది. ఈ ఘటన ఢిల్లీలోని మెట్రో రైలులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదు

మెట్రో రైలులో ఒకే వరుసలో ఇద్దరు మహిళలు పక్కపక్కనే కూర్చున్నారు. వీళ్లిద్దరికీ సౌకర్యవంతంగా కూర్చోవడానికి అక్కడ ప్లేస్ ఉంది. కానీ.. ఎక్కడ చెడిందో తెలీదు కానీ, సీటు విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మనం ఆ వీడియోలో చూస్తే.. ట్రైన్ దాదాపు ఖాళీగా ఉంది. సీట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. అంతెందుకు.. ఏ సీటు కోసమైతే ఆ మహిళలు గొడవపడ్డారో, అక్కడ ఇద్దరి మధ్య జాగా బాగానే ఉంది. అయినా ఎందుకో సీటు కోసం ఈ ఇద్దరు శివాలెత్తారు. బూతులు తిట్టేసుకున్నారు. ఒక మహిళ అయితే.. ‘ఇంకో మాట మాట్లాడితే నా చేతి దెబ్బ రుచి చూస్తావ్’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నాకే వార్నింగ్ ఇస్తావా? అంటూ ఇంకో మరో మహిళ.. ‘నీలాంటి వాళ్ల కోసమే నేను పెప్పర్ స్ర్పే పెట్టుకున్నా, ఇప్పుడే ఉండు, నీ ముఖంపై కొడతా’ అంటూ పెప్పర్ స్ర్పే తీసింది.

PBKS vs RR: శివాలెత్తిన శిఖర్ ధవన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

ప్రయాణికురాలు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ మహిళ మాత్రం వినలేదు. ఎలాగో బయటకు తీసింది కాబట్టి.. దాని మూత విప్పి స్ర్పే చల్లింది. అనంతరం అక్కడి నుంచి లేచి ఆమె వెళ్లిపోయింది. అయితే.. ఈ స్ర్పే ఘాటు కొన్ని క్షణాల్లోనే కంపార్ట్‌మెంట్‌ అంతా వ్యాపించడంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో చూసిన మెట్రో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌.. సదరు కోచ్ నంబర్ తీసుకుని, చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు.. ప్రజా రవాణాలో ఇటువంటి గొడవలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సర్దుకుపోతే పోయేదాన్ని.. ఇంతదాకా తీసుకురావాల్సిన అవసరం ఏముంది?

Exit mobile version