మరో దారుణం.. మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం.. ఆపై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఏదో ఓ చోట ప్రతీ రోజు మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. సాధారణ మహిళలే కాదు.. ప్రభుత్వ విధుల్లో కీలకంగా పనిచేస్తున్నవారు కూడా ఈ వేధింపులకు, అఘాయిత్యాలకు బలిఅవుతున్నారు. ఇక, పోలీసులు అంటేనే.. చాలా మంది వణికిపోతారు.. కానీ, ఓ మహిళా కానిస్టేబుల్‌ను సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని.. పార్టీ ఉందంటూ ఆహ్వానించిన ఓ వ్యక్తి ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డడాడు.. ఇక, వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో జరిగిన ఘటను సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 30 ఏళ్ల వయస్సున్న బాధిత కానిస్టేబుల్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన నిందితుడు.. ఆ పరిచయాన్ని ఫేస్బుక్ నుంచి వాట్సప్ వరకు తీసుకెళ్లారు.. తరచూ బాధిత మహిళా కానిస్టేబుల్‌తో చాటింగ్ చేసేవాడు.. ఇక, కొన్ని రోజుల తర్వాత అతడిలోని కన్నింగ్ ఫెలో నిద్రలేచాడు.. ఈ నెల ఆరంభంలో తన సోదరుడి పుట్టిన రోజు ఉందంటూ.. ఆ ఫంక్షన్‌ను రావాలంటూ బాధితురాలని ఆహ్వానించాడు. అతడి మాటలు నమ్మి వెళ్లిన బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక, ఆ ఘటనను వీడియో కూడా తీశారని ఫిర్యాదులో పేర్కొంది.. నిందితుడి తల్లి తనను బెదిరించిందని, వారి బంధువు ఒకరు తనను చంపేస్తానని హెచ్చరించారని గోడు వెల్లబోసుకుంది.. మొదట నీముచ్‌లో పనిచేసిన ఆ బాధిత కానిస్టేబుల్ ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్టు చెబుతున్న పోలీసులు.. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల ఆరంభంలో ఈ ఘటన జరగగా.. ఈ నెల 13వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.. ప్రధాన నిందితుడి తల్లి సహా ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు కాగా.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
Also Read
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
తాజావార్తలు
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!