Site icon NTV Telugu

Viral Video: “స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ”.. డెలివరీబాయ్ ఏం చేశాడంటే..

Video (1)

Video (1)

Viral Video: ఒక మహిళ స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్మశానంలోకి ఫుడ్ ఆర్డర్ ఏంటా.? అని ఆందోళన చెందడం డెలివరీ బాయ్ వంతైంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఆన్లైల్‌లో కనిపిస్తున్న వీడియోలో, డెలివరీ ఏజెంట్ ఫోన్‌లో కస్టమర్‌తో మాట్లాడుతూ.. లొకేషన్ వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, మహిళ సమాధానం విన్న డెలివరీ బాయ్‌కి ఫ్యూజులు అవుటయ్యాయి.

మహిళ శ్మశానంలో ఉన్నట్లు డెలివరీ బాయ్‌కు అర్థం అవుతుంది. డెలివరీ ఏజెంట్ మహిళతో మాట్లాడుతూ.. ‘‘మేడమ్ నేను లొకేషన్‌లో ఉన్నాను. నేను ఇప్పుడు ఎక్కడి రావాలి..?’’ అని అడుగుతాడు. ఇందుకు ఆ మహిళ ‘‘ నేరుగా రండి, అక్కడ ఒక కుక్క కూర్చుని ఉండటం చూస్తారు’’ అని చెబుతుంది. దీనికి డెలివరీ బాయ్..‘‘మేడమ్ అది స్మశానవాటిక’’ అని చెబుతాడు. దీనికి మహిళ..‘‘కుక్కను చూశారు కదా? స్మశాన వాటిక గేటు లోపటికి రండి’’ అని అడుగుతుంది.

Read Also: Face Signals: మీ ముఖం మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతోంది.?

దీంతో షాక్ అయిన డెలివరీ బాయ్ ‘‘మీరు స్మశాన వాటిక నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారా.?.’’ అని అడుగుతూ, లోపలికి వెళ్లడానికి నిరాకరించి, గేట్ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకోవాలని కోరుతాడు. దీనికి మహిళ స్పందిస్తూ.. ‘‘ భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను’’ అని చెబుతుంది. నవ్వుతూ.. ‘‘నీకు దయ్యాలు అంటే భయమా.?’’ అని అడుగుతుంది. దీనికి డెలివరీ ఏజెంట్ గేట్ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకోకుంటే, క్యాన్సల్ చేస్తానని చెబుతాడు.

అయితే, స్మశాన వాటికలో ఉన్న మహిళ చాలా ప్రశాంతంగా ఎలాంటి భయం లేకుండా మాట్లాడటం చాలా మందిని భయపెడుతోది. ఇది డెలివరీ ఏజెంట్‌ను భయపెట్టడానికి చేసిన ఫ్రాంక్ వీడియోనా..? లేక ఆ మహిళ తన స్నేహితులతో స్మశానంలోనే ఉండా? అని అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా వ్యూస్ కోసం ఇలా చేశారా? అని చాలా మంది నెటిజన్లు అనుమానిస్తున్నారు.

Exit mobile version