Nurse Left Husband: జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా? భర్త చెమటోడ్చి ఆమెను చదివిస్తే.. ఉద్యోగం వచ్చాక భర్తని వదిలేసి, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగు చూసింది. భర్త లోన్ తీసుకొని మరీ చదివిస్తే.. నర్సు ఉద్యోగం రాగానే భార్య తన లవర్‌తో చెక్కేసింది. నువ్వు మరొకరిని చూసుకో అని చెప్పి వెళ్లిపోయింది. దీంతో.. భర్త తన గోడుని కలెక్టర్ ముందు విన్నవించుకునేందుకు వచ్చాడు. తన భార్యని తిరిగి తన వద్దకు తీసుకురమ్మని వేడుకుంటున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Nani Controversy: పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్యలు.. నానిపై మండిడుతున్న బడా హీరోల ఫ్యాన్స్
ఉత్తరప్రదేశ్‌లోని అనూప్‌పూర్ జిల్లా పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా కొన్ని సంవత్సరాల క్రితం మీనాక్షి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి.. ఆమెకు అంతకుముందే మరో వ్యక్తితో పెళ్లయ్యింది. అయితే.. భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ఆ సమయంలో మీనాకితో జోహన్‌కి పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం, తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరి పెళ్లికి జోహన్ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా.. వారిని ఎదురించి మరీ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు చిహ్నంగా ఒక కుమార్తె కూడా పుట్టింది. కట్ చేస్తే.. మీనాక్షికి నర్సు అవ్వాలనేది కోరిక. ఈ విషయం తెలుసుకున్న భర్త, ఆమెను చదివించాడు. ఆమె నర్సింగ్ శిక్షణకు తన వద్ద డబ్బులు లేకపోయినా.. లోన్ తీసుకొని మరీ లక్షా 15 వేలు ఖర్చు చేశాడు. బీమా పాలసీని సైతం వదులుకున్నాడు.
Power Bill Cyber Crime: భారీ సైబర్ మోసం.. 5 రూపాయలు పంపగానే, 1.85 లక్షలు హాంఫట్
ఇలా భర్త కష్టార్జితం నర్సింగ్‌లో శిక్షణ తీసుకున్న మీనాక్షి.. ఎట్టకేలకు నర్సు ఉద్యోగం సంపాదించింది. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత మీనాక్షి తన అసలు రంగు బయటపెట్టింది. అక్కడ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని, భర్తని వదిలేసింది. ‘నా జీవితంలోకి మరొకరు వచ్చారు, నువ్వు ఇంకొకరిని చూసుకో’ అంటూ భర్తకు చెప్పింది. తన కూతురిని సైతం తీసుకెళ్లిపోయింది. తిరిగి రావాలని ఎంత బ్రతిమాలినా ఆమె రాకపోవడంతో.. తన గోడు విన్నవించేందుకు అనూప్‌పూర్ కలెక్టర్ వద్దకు వెళ్లాడు. అప్పులు చేసి మరీ మీనాక్షిని చదివిస్తే, ఉద్యోగం వచ్చాక తనని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెను తిరిగి తన దగ్గరకు చేర్చాలని కలెక్టర్‌ని కోరాడు. మరి.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
