Site icon NTV Telugu

UP: భార్యాభర్తల మధ్య ఘర్షణ.. బిల్డింగ్‌పైకి ఎక్కి భార్య ఏం చేసిందంటే..!

Upwomen

Upwomen

ఆలుమగలు అన్నాక చిన్న.. చిన్న గొడవలు.. అలకలు సహజమే. అలా పోట్లాడుకుంటారు.. అంతలోనే కలిసిపోతుంటారు. ఇదంతా సంసార జీవితంలో కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. యూపీలో ఒక మహిళ మాత్రం రెండు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. అనంతరం భర్త చితకబాదాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: అదే గనుక జరిగితే అమెరికా పేద స్థితికి వెళ్లిపోతుంది.. సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఉత్తర ప్రదేశ్‌‌లోని అలీబాగ్‌లోని గోండా ఏరియా దాకౌలి గ్రామంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య ఏడుస్తూ బిల్డింగ్‌పైకి ఎక్కింది. కిందకు దూకేస్తానంటూ భర్తను, కుటుంబ సభ్యుల్ని బెదిరించింది. ఇంతలో చిన్నారి.. అమ్మా.. అమ్మా అంటూ ఏడుస్తోంది. దూకి చస్తానంటూ పదే పదే బెదిరించడంతో భర్త కూడా దూకమని బదులిచ్చాడు. దీంతో ఆమె అన్నంత పని చేసేసింది. బిల్డింగ్ పైనుంచి భూమిపైకి దూకేసింది. కింద పడగానే వెంటనే భర్త కట్టె తీసుకుని చితకబాదాడు. ఆమె బిడ్డ మాత్రం అమ్మా.. అమ్మా అంటూ ఏడుస్తూ కనిపించింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలికి పోలీసులు వచ్చారు. బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

 

Exit mobile version