Site icon NTV Telugu

Karnataka: తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్‌లో కూతురికి పోస్టింగ్..

Karnataka

Karnataka

Karnataka: తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలను చూడాలని కలలు కంటారు. తమను మించిన వాళ్లు కావాలని కోరుకుంటారు. తాజాగా కర్ణాటకలో ఓ యువతి అదే చేతి చూపించింది. తండ్రి బాధ్యతలను తాను స్వీకరించింది, ఇన్నాళ్లు పోలీస్ ఇన్స్పెక్టర్ గా తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్ లో కూతురికి పోస్టింగ్ వచ్చింది. స్వయంగా ఆయనే తన కూతురికి బాధ్యతలు అప్పగించారు.

Read Also: PM Modi US Visit: ప్రధాని మోడీకి వైట్‌హౌజ్‌లో విందు.. నోరూరించే మెనూ ఇదే..

వివరాల్లోకి వెళితే కర్ణాటక మాండ్యా జిల్లాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్, తన సొంత కుమార్తె వర్షకు తన విధులను అప్పగించారు. ఈ అరుదైన ఘటనను పోలీస్‌స్టేషన్‌లో అందరూ చూశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన కుమార్తెకు వెంకటేష్‌ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. గత ఏడాది పీఎస్ఐ( పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ) పరీక్షల్లో వెంకటేష్ కుమార్తె వర్ష అర్హత సాధించారు. యాదృచ్చికంగా వర్షకు తండ్రి పనిచేస్తున్న అదే పోలీస్ స్టేషన్ లో, అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

వెంకటేష్ పదవీ విరమణకు ముందు 16 16 ఏళ్ల పాటు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవలందించారు. 2010లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పీఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మాండ్యాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న వర్ష, తండ్రిలాగే పోలీస్ కావాలని అనుకుంది. 2022 బ్యాచ్ పీఎస్ఐ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. గతేడాది ప్రొబేషనరీ పూర్తి చేసుకుంది. తాజా ఆమె తన తండ్రి పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ చేయబడింది. తన విధులను అప్పగిస్తూ వెంకటేష్, కూతురికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

Exit mobile version