ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 28 ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో రెండున్నర గంటల పాటు ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: కుటుంబ సభ్యులతో న్యూఇయర్ వేడుకలకు రాహుల్‌గాంధీ ప్లాన్.. ఎక్కడంటే..!
సోమవారం-మంగళవారం మధ్య రాత్రిలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఒక వ్యాన్ వచ్చింది. ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు వ్యాన్ ఎక్కించుకున్నారు. అయితే వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వాహనం గుర్గావ్ రోడ్డు వైపు వెళ్లింది. అనంతరం ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా నిందితులు మాత్రం ఆగలేదు. బెదిరించి మరీ అత్యాచారం చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: 2025లో మోడీ నాయకత్వంలో అద్భుత ఘట్టాలు ఇవే!
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎస్‌జీఎం నగర్‌లోని రాజా చౌక్ సమీపంలో మహిళను బయటకు విసిరివేసి పరాయ్యారు. దీంతో బాధితురాలి ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే సోదరికి పదే పదే ఫోన్ చేశాక స్పందించింది. సంఘటనాస్థలికి చేరుకోగానే పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ముఖానికి 10-12 కుట్లు వేశారు. ప్రస్తుతం బాధితురాలు షాక్‌లో ఉందని.. స్టేట్‌మెంట్ ఇంకా నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
బాధితురాలి సోదరి తన ఫిర్యాదులో.. అత్యాచారం జరగడానికి ఒక రోజు ముందు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తనకు ఫోన్ చేసి తల్లితో గొడవ పడినట్లు చెప్పిందని తెలిపింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని.. తాను మూడు గంటల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పినట్లుగా పేర్కొంది. తన సోదరికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. భర్తతో వివాదం కారణంగా విడివిడిగా ఉంటున్నారని వెల్లడించింది. ఇక పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
