Madya Pradesh: 50-60 రోటీలు తిన్నా తీరని ఆకలి.. వింత వ్యాధితో బాధపడుతున్న మహిళ
- రాజ్‌గఢ్‌లో వింత వ్యాధితో బాధపడుతున్న మంజు అనే మహిళ
- ఎంత తిన్నా తీరని ఆకలి.. మానసిక రోగం అంటున్న నిపుణులు
- చికిత్స చేయకుంటే మరింత ప్రమాదమంటున్న వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ మహిళ వింత వ్యాధితో బాధపడుతుంది. ఆ మహిళ రోజుకు 60 రోటీలను తిన్నప్పటికి ఆమె ఆకలి తీరడం లేదని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. ఈ వ్యాధితో బాధపగుతున్న వ్యక్తి రోజంతా ఆకలితో ఉంటాడు. ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. దీనికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని వైద్యులు చెబుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌గఢ్‌లో ఓ మహిళ వింత రోగంతో బాధపడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారు రోజంతా ఆకలితో ఉంటారు. ఈ వ్యాధి వచ్చిన మహిళ చికిత్స లక్షల రూపాయలు ఖర్చు చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వ్యాధికి అసలు కారణం ఏంటో ఇప్పటి వైద్యులు గుర్తించలేకపోయారు. నేటికీ ఈ వ్యాధికి గల కారణాల్లేంటో వెల్లడి కాలేదని తెలిసింది. ఆమె తరచుగా ఏదో ఒకటి తినకపోతే, ఆమె శరీరం శక్తిహీనంగా మారిపోతుందని బాధిత మహిళ మంజు కుటుంబం వెల్లడించింది. ఒక సాధారణ వ్యక్తి 3-4 రోట్టెలు తింటే ఆకలి తీరుతుంది. కానీ, మంజు ఒకేసారి కనీసం 10-12 రొట్టెలు తింటే గానీ ఆమెకు ఆకలి తీరదని చెబుతున్నారు. అలా ఆమె రోజంతా దాదాపు 50 నుంచి 60కి పైగా తింటుందని చెప్పారు.
Also Read
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
అతిగా ఆకలి వేయడం అనేది సాధారణ శారీరక అనారోగ్యం కాదని, ఇది సైకియాట్రిక్ డిజార్డర్ అని పిలువబడే మానసిక అనారోగ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. దీనిలో రోగి నిరంతరం ఆకలితో ఉంటాడు. అతను తినాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా తెలియదని… కొన్నిసార్లు ఇది బింగే ఈటింగ్ డిజార్డర్ కారణంగా కూడా జరుగుతుందని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మీనాక్షి జైన్ చెప్పారు. అతిగా తినడం అనే సాధారణ విషయం మాత్రమే కాదని.. దాని వెనుక తీవ్రమైన వైద్య సమస్య ఉందని చెప్పారు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఆహారం తిన్నప్పటికీ అతడు నిరంతరం ఆకలితో ఉన్నప్పుడు, అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా చెప్పారు.. అలాంటి సందర్భాలలో చికిత్స ఆలస్యం చేయడం శరీరం, మనస్సు రెండింటికీ ప్రమాదకరమని చెప్పారు.
గత 3 సంవత్సరాలలో మంజు చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 5-7 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆమె చికిత్సకు ఇకపై తమ వద్ద డబ్బు లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు ఆమెకు పండ్లు తినమని సలహా ఇచ్చారు. ఈ వ్యాధి కారణంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!