Site icon NTV Telugu

Shocking Video: వృద్ధాశ్రమానికి వెళ్లనందుకు.. అత్తపై దారుణంగా దాడి చేసిన కోడలు..

Shocking Video

Shocking Video

Shocking Video: అత్తగారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ కోడలు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ, మహిళ తరుపు బంధువులు భర్తపై, ఆమె తల్లిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. వృద్ధురాలు అని చూడకుండా కోడలు, తన అత్తని జట్టు పట్టి లాగి దాడి చేసింది. తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించినందుకు కోడలు ఈ దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఏప్రిల్ 4న సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ ఘటనప విశాల్ బాత్రా ఫిర్యాదు చేశాడు. తన భార్య నీలిమ తన 70 ఏళ్ల తల్లి సరళ బాత్రాను ఇంటి నుంచి పంపించి, ఆమెను వృద్ధాశ్రమానికి తరలించాలని ఏడాది నుంచి ఒత్తిడి చేస్తుందని అయితే, తన తల్లి ఆరోగ్య పరిస్థితులు వల్ల తాను నిరాకరించడంతో తరుచు గొడవలు జరుగుతున్నట్లు చెప్పాడు.

Read Also: Ponguru Narayana: 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక..

నీలిమ తండ్రి, సోదరుడిని ఇంటికి పిలిపించడంతో ఈ గొడవ పెద్దైంది. నీలిమ సోదరుడు బావ అని చూడకుండా విశాల్‌పై శారీరకంగా దాడి చేశాడు. అతడి తల్లి సరళను జుట్టు పట్టుకుని లాగి, నేలపై పడేసి నీలిమ అనేక సార్లు కొట్టింది. బాధితురాలు సరళా బాత్రా మాట్లాడుతూ.. తన కోడలు చాలా రోజులుగా తనను వేధిస్తోందని, కానీ తన కొడుకును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు తాను మౌనంగా ఉన్నానని చెప్పింది. అయితే, విశాల్‌పై దాడి జరిగినప్పుడు ఆమె జోక్యం చేసుకున్నట్లు చెప్పింది. తన కొడుకు ముందే తనను కోడులు, ఆమె బంధువులు దాడి చేసినట్లు చెప్పింది.

ప్రాణభయంతో విశాల్, అతడి తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నీలిమ తండ్రి, సోదరుడు పోలీస్ స్టేషన్‌ లోపల కూడా తమను చంపుతామని బెదిరించారని వారు ఆరోపించారు. అప్పటి నుంచి తల్లి, కొడుకులు తమ ఇంటిని వదిలిపెట్టి సాయం కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌ బయట విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా ఇంట్లో నాపై దాడి జరిగింది. దాదాపుగా 10-15 మంది వ్యక్తులు లోపలికి ప్రవేశించి నాపై, నా తల్లిపై దాడి చేశారు. నా తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టాలని నా భార్య నన్ను వేధిస్తోంది’’ అని చెప్పారు. సరళా బాత్రా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సీఎస్పీ రాబిన్ జైన్ తెలిపారు.

Exit mobile version