NTV Telugu Site icon

Dowry Demand: తోటి డాక్టర్‌ను పెళ్లాడేందుకు రూ.50 కోట్లు కట్నం డిమాండ్.. ట్విస్ట్ ఏంటంటే..!

Dowrydemand

Dowrydemand

కట్నం పిశాచి ఇంకా మనుషులను వెంటాడుతూనే ఉంది. ఎన్ని ఆస్తులున్నా.. ఎంత చదువున్నా.. కట్నం జాడ్యం మాత్రం ఇంకా జెలగలా పీక్కుతుంటూనే ఉంటుంది. విద్యావంతులు ఇలానే ఉంటున్నారు.. విద్యలేని వాళ్లు అలానే ఉంటున్నారు. అబ్బాయైతే చాలు కట్నం డిమాండ్ చేయాలన్న పాడుబుద్ధి వచ్చేస్తోంది. ఇంకోవైపు ఆడ పిల్లల చదువుల కోసం లక్షలు.. లక్షలు ధారపోసి చదివించి.. తీరా పెళ్లి చేసే సమయానికి మళ్లీ కట్న, కానుకలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పటికే పేరెంట్స్ అప్పులు అయిపోతే.. పెళ్లి పేరుతో మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: India Russia: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్.. వీసా లేకుండా రష్యాకు వెళ్లొచ్చు..

వారిద్దరూ ఒకే వృత్తిలో ఉన్నారు. ఇద్దరూ వైద్య వృత్తిని అభ్యసించిన వారు. పైగా ఇద్దరూ ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యలో నిష్ణాతులు. కాలేయ మార్పిడి అనస్థీషియాలో నైపుణ్యం కలిగివారు. అయితే ఎయిమ్స్‌లో అనస్థీషియాలో నిపుణుడైన డాక్టర్.. హైదరాబాద్‌లో అనస్థీషియాలో వైద్యురాలైన మహిళను పెళ్లి చేసుకునేందుకు దాదాపు రూ.50 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు. దీంతో ఆ కుటుంబం నిర్ఘంతపోయింది. ఇదే విషయాన్ని వైద్యురాలు.. బెంగళూరులో ఉన్న స్నేహితురాలైన డాక్టర్ ఫీనిక్స్‌తో పంచుకుంది. కన్నీటిపర్యంతం అయింది. తాజాగా స్నేహితురాలికి ఎదురైన సమస్యను ఫీనిక్స్‌.. ఎక్స్ ట్విట్టర్‌లో పంచుకుంది. రాకెట్ యుగంలో దూసుకెళ్తున్న సమజంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? అని ఆశ్చర్యపోయింది. తోటి డాక్టర్‌ను పెళ్లిచేసుకునేందుకు ఎయిమ్స్ టాప్ ర్యాంకర్ రూ.50 కోట్లు డిమాండ్ చేయడమా? అని నిలదీసింది. తల్లిదండ్రులు జీవితాంతం పొదుపు చేసిన సంపాదనంతా స్నేహితురాలి పెళ్లికి ఖర్చు చేస్తే.. ఆమె చెల్లిలి భవిష్యత్ ఏంటి? అని ప్రశ్నించింది. తెలుగమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే కట్నం తప్పదని తేలిపోయిందని ఆమె పోస్టు చేసింది. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. నెటిజన్లు రకరకాలు దుమ్మెత్తిపోతున్నారు. డాక్టర్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Akshay Kumar: అయోధ్యలోని కోతుల ఆహారం కోసం బాలివుడ్ యాక్టర్ భారీ విరాళం..

Show comments