Site icon NTV Telugu

Bengaluru: చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం.. నిందితుడెవరంటే..!

Bengaluru

Bengaluru

టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లివ్ ఇన్ పార్ట్‌నర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!

ఆదివారం బెంగళూరు మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం ప్రత్యక్షమైంది. ట్రక్కులో మృతదేహం కలిగిన గోనె సంచి లభించింది. చేతులు కట్టేసి.. సంచిలో కుక్కేసినట్లుగా కనిపించింది. దీంతో బీబీఎంపీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి.. మృతురాలు ఆశ (40)గా గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్ (33) అనే యువకుడితో సంబంధం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

ఇది కూడా చదవండి: Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల

ఏడాదిన్నరగా ఆశ, మహ్మద్ షంషుద్దీన్ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహ్మద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లంతా అస్సాంలో ఉంటున్నారు. ఇక ఆశ వితంతువుగా ఉంది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ భార్యాభర్తలుగా మసులుకుంటున్నారు. ఆశా అర్బన్ కంపెనీలో పనిచేసేది మరియు హౌస్ కీపింగ్ సేవలను అందించేది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. అనంతరం మహ్మద్ షంషుద్దీన్ ఆమె గొంతుకోసి చంపేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగలసర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి చెత్త ట్రక్కులో వేశాడని చెప్పారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Exit mobile version