NTV Telugu Site icon

Woman beats society guard: శునకాలపట్ల క్రూర ప్రవర్తన.. సెక్యూరిటీ గార్డ్‌కు బడితే పూజ..!

Agra

Agra

జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన ఘటనకు సంబంధించిన దాదాపు 2.10 నిమిషాల క్లిప్‌లో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Read Also: Ram Gopal Varma: భార్యల నుంచి భర్తలు స్వాతంత్య్రం పొందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం

తిట్టడం, కొట్టడమే కాదు.. బీజేపీ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆ వ్యక్తిని బెదిరించినట్లు తెలుస్తోంది. పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ ఈ ఘటనపై మాట్లాడుతూ, “ఒక మహిళ గార్డును కర్రతో కొట్టినట్లు కనిపించే వీడియో వైరల్ అవుతోంది. ఆగ్రా పోలీసులు వీడియోపై దృష్టి సారించారు మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు… న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో విజయ్ వికారమ్ సింగ్ మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ ఆఫీసర్ కాలనీలో పనిచేస్తున్న గార్డు అఖిలేష్ సింగ్ ఫిర్యాదు చేశారు. వైరల్ వీడియోలో గార్డును కొట్టినట్లు కనిపించిన మహిళ వివరాలను పొందడానికి మేం ప్రయత్నిస్తున్నాము. ఆ వ్యక్తి న్యూ ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తాను మాజీ సైనికుడినని వీడియోలో చెబుతున్నాడు. అతను కాలనీ నుండి దూరంగా కుక్కలను తరిమికొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇక, ఆ తర్వాత ఆ మహిళ తనను జంతు హక్కుల కార్యకర్త డింపి మహేంద్రుగా పరిచయం చేసుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది.