Site icon NTV Telugu

China: అక్వేరియంలో రష్యన్ మత్స్యకన్య ప్రదర్శన.. అమాంతంగా చేప దాడి.. వీడియో వైరల్

China

China

చైనాలోని అక్వేరియంలో మత్స్యకన్యగా ప్రదర్శన చేస్తున్న మహిళపై పెద్ద చేప అమాంతంగా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చైనాలోని జిషువాంగ్‌బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో ఒక యువ రష్యన్ మత్స్యకన్య మాషా(22) అక్వేరియంలో ప్రదర్శన ఇస్తోంది. ఇంతలో ఒక పెద్ద చేప అమాంతంగా దాడి చేసింది. తలను నోటితో కరవబోయింది. వెంటనే అప్రమత్తమై తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆమెకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Crime: తనతో మాట్లాడటం లేదని విద్యార్థిని గొంతు కోసిన వ్యక్తి..

యువతి తల, మెడ, కంటిపై కొరికివేయడాన్ని ప్రేక్షకులు బయట నుంచి చూస్తూ షాక్‌ అయ్యారు. మొత్తానికి తప్పించుకుని సురక్షితంగా బయటకు వచ్చేసింది. ప్రేక్షకులు మాత్రం భయాందోళన చెందారు. దాడి కారణంగా మాషా తల, మెడ, కంటికి గాయాలయ్యాయని ది డైలీ మెయిల్‌లోని నివేదికలు వెల్లడించాయి. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ ఆమె తన ప్రదర్శనను కొనసాగించిందని రష్యన్ మీడియా వర్గాలు తెలిపాయి. ఆమెకు నష్టపరిహారం కూడా అందించినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: RK Roja: సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలి?

Exit mobile version