Site icon NTV Telugu

Stray Dogs Attack: మహిళపై 20 కుక్కల దాడి.. శరీరాన్ని ముక్కలుగా చేసి..

Stray Dogs Attack

Stray Dogs Attack

Stray Dogs Attack: పంజాబ్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళపై దాదాపుగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక సుల్తాన్ పూర్ లోధిలో మహిళ పశువుల్ని మేపేందుకు పొలాల్లోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Read Also: Banana Exports: భారత అరటిపండ్లకు ఫుల్ డిమాండ్.. రష్యాకు ఎగుమతి..

సాయంత్రం భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త వెతకడం ప్రారంభించాడు. చివరకు ఆమె మృతదేహం పూర్తిగా ముక్కలైన స్థితిలో కనుగొన్నాడు. బాధితురాలని పారిదేవీ(32)గా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయని, బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత జిల్లా యంత్రాంగం వీధి కుక్కలపై చర్యలు ప్రారంభించింది.

దేశంలో వీధి కుక్కల దాడుల్లో మరణిస్తున్న, గాయపడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు కుక్కల దాడులకు ఎక్కువగా గురవుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలోనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version