NTV Telugu Site icon

Fake currency: యూట్యూబ్ సాయం.. రూ. 500 నకిలీ నోట్ల ప్రింటింగ్..

Fake Currency

Fake Currency

Fake currency: యూట్యూబ్ చూసి నేరగాళ్లు కొత్త రకం నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూట్యూబ్ చూసి ఏకంగా ఓ గ్యాంగ్ రూ.500 నోట్లను ముద్రించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. నకిలీ నోట్ల తయారీ రాకెట్‌ని నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రూ. 30,000 విలువైన ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.

Read Also: Gwalior: గ్వాలియర్‌లో కాల్పులు.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు సతీష్ రాయ్, ప్రయోద్ మిశ్రా 10 రూపాయాల స్టాంప్ పేపర్లపై నకిలీ రూ. 500 నోట్లను కంప్యూటర్ ద్వారా ప్రింటింగ్‌లో ముద్రించేవారు. వీరు దీని కోసం మీర్జాపూర్ నుంచి స్టాంప్ పేపర్ కొనుగోలు చేశారు. అన్ని నోట్లకు కూడా ఒకే సీరియల్ నెంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫేక్ కరెన్సీపై వీరిద్దరు మరో రూ. 10,000 ఖర్చు చేయబోతున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

తాము రూ. 500 కరెన్సీకి సంబంధించి 20 నకిలీ నోట్లను కనుగొన్నామని, కరెన్సీ నోట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పా అవి నిజమైనవి కావని ఎవరూ గుర్తించలేరని ఏఎస్పీ కలు సింగ్ చెప్పారు. నిందితులు మినరల్ వాటర్ ప్రకటనలను తయారు చేస్తుంటారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లను ప్రింట్ చేయడం నేర్చుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ఆల్టో కారు, నోట్ల ముద్రణ పరికరాలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లనున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.