NTV Telugu Site icon

Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..

Parliament

Parliament

Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సమావేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫారసు చేసిన మహువా మోయిత్రా బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంది.

Read Also: Canada: వీడు ‘బాల బాహుబలి’.. 6.8 కిలోల బరువుతో పుట్టాడు..

IPC, CrPC మరియు ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కీలక బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీటిపై హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో వీటని ప్రవేశపెట్టినా.. ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసన ముందు ఇది ముందుకు రాలేదు. ఈ బిల్లు సీఈసీ, ఈసీల హోదాను క్యాబినెట్ కార్యదర్శి హోదాతో సమానం చేయాలని కోరుతోంది. ప్రస్తుతం వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను అనుభవిస్తున్నారు.