NTV Telugu Site icon

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు

Parliament

Parliament

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు సమయం అసన్నమైంది… సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబ‌ర్‌ 23వ తేదీ వ‌ర‌కు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వ‌ర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక, ఈ సెషన్‌లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీల‌క బిల్లుల‌ను ప్రవేశ‌పెట్టబోతోంది.. పెన్షన్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చ‌ట్టం-2013 స‌వ‌ర‌ణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం-1949 స‌వ‌ర‌ణ బిల్లు ఈ స‌మావేశాల్లో టేబుల్‌పైకి వస్తాయని చెబుతున్నారు.. మరోవైపు, బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ కోసం బ్యాంకింగ్ కంపెనీస్ చ‌ట్టం-1970, బ్యాంకింగ్ కంపెనీస్ చ‌ట్టం-1980కి కూడా స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు సిద్ధమైంది నరేంద్ర మోడీ సర్కార్.. బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించిన జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్‌మెంట్ బిల్‌-2021కి కేంద్ర స‌ర్కారు గ‌త వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే పార్లమెంట్ ఆమోద‌ముద్ర వేయించుకున్నది. ఇక, పార్లమెంట్‌ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు కావడంతో.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి అధికార, ప్రతిపక్షాలు..