Site icon NTV Telugu

SpiceJet: షాకింగ్ ఘటన.. గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్.. ప్రయాణికులు హడల్

Spicejet

Spicejet

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది. ప్యాసింజర్స్‌లో ఇలాంటి భయాలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్స్‌లైన్స్‌లు ఎంత అప్రమత్తంగా ఉండాలి. కానీ తాజాగా ఘటనతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గోవా నుంచి పుణెకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం.. గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..

మంగళవారం స్పైస్‌జెట్‌కు చెందిన SG1080 విమానం గోవా నుంచి పూణెకు వెళ్తోంది. గాల్లో ఉండగా అకస్మాత్తుగా కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇది కూడా చదవండి: Rashmika : ఇండస్ట్రీలో కెరీర్‌ను నిలబెట్టుకోవడమే అసలైన యుద్ధం..

ఇక పూణె విమానాశ్రయంలో విండో ఫ్రేమ్‌ను సరి చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది. ప్రయాణికుల భద్రతకు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు ఏ విధంగానూ రాజీ పడబోమని చెప్పింది. విమానం అంతటా క్యాబిన్ ప్రెజరైజేషన్ బాగానే ఉందని.. కిటికీ ఫ్రేమ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది.

అయితే కిటికీ ఫ్రేమ్ ఊడిపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు చేయకుండా విమానాలను ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రత ఎయిర్‌లైన్స్‌కు పట్టవా? అని నిలదీస్తు్న్నారు. అసలు ఇలాంటి విమానాలు ఎగిరే అర్హత ఉందా? అని మరికొందరు ప్రశ్నిస్తు్న్నారు.

 

Exit mobile version