Site icon NTV Telugu

Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ ‘బాడీ డబుల్’ వాడారు.. త్వరలో అన్ని ఆధారాలు వెల్లడిస్తా..

Rahul Gandhi

Rahul Gandhi

Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాం లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇద్దరి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. ఇటీవల సీఎం హిమంత మాట్లాడుతూ.. యాత్రలో రాహుల్ గాంధీ తన ‘బాడీ డబుల్’ ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Prashant Kishore: ‘‘ఇది మూన్నాళ్ల ముచ్చటే’’.. బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త పీకే సంచలనం..

రాహుల్ గాంధీ ‘బాడీ డబుల్’ పేరు, చిరునామా త్వరలో వెల్లడిస్తానని సీఎం అన్నారు. ‘‘ రాహుల్ గాంధీలా ఉన్న నకిలీ పేరు, చిరునామాను తర్వలో పంచుకుంటాను, కొన్ని రోజులు వేచి ఉండండి’’ అని శనివారం సోనిత్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. తాను రెండు రోజుల పాటు దిబ్రూగఢ్‌లో ప్రవేశించనున్నానని, గౌహతికి తిరిగి వచ్చిన తర్వాత డూప్లికేట్ పేరు, అతని చిరునామా ఇస్తానని చెప్పారు.

ఇటీవల అస్సాంలో కాంగ్రెస్ ర్యాలీలో రాహుల్ గాంధీ ‘బాడీ డబుల్’ ఉపయోగించినట్లు ఆరోపించారు. రాహుల్ గాంధీ తన బస్సు ప్రయాణాల్లో ‘బాడీ డబుల్’ని ఉపయోగిస్తున్నారు, అంటే బస్సు ముందు కూర్చుని ప్రజలను చూస్తు్న్న వ్యక్తి బహుశా నిజమైన రాహుల్ గాంధీ కాదని గత వారం గురువారం ఆరోపించారు. రాహుల్ గాంధీ బాడీడబుల్ ఉపయోగించడం పెద్ద కుట్రలో భాగమేనా.? అని ఆయన ప్రశ్నించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కోసం కాంగ్రెస్ ఉపయోగించిన బస్సులో అనేక గదులు ఉన్నాయని, “రాహుల్ గాంధీ” లాగా ఉండే వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో లోపల కూర్చుంటారని హిమంత శర్మ పేర్కొన్నారు.

Exit mobile version