Site icon NTV Telugu

PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్‌మెయిల్‌ని సహించదు.. పాక్‌కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..

Pm Modi

Pm Modi

PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీని తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దాడులు చేశామని చెప్పారు. ప్రపంచ ఉగ్రవాదానికి యూనివర్సిటీలుగా ఉన్న బహవల్‌పూర్, మురిడ్కే ప్రాంతాలను నాశనం చేసినట్లు చెప్పారు.

Read Also: Congress: జమ్మూ కాశ్మీర్‌ని పాక్‌లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్.. బీజేపీ విమర్శలు..

అణ్వాయుధాలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడాన్ని భారత్ ఇక సహించదని పాకిస్తాన్‌కి ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఏ విధమైన అణు బ్లాక్‌మెయిల్ భారత్ సహించదు. ఈ బ్లాక్‌మెయిల్ కింద పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటాం’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై భారత్ బలమైన వైఖరితో ఉన్నామని, ఏదైనా ఉగ్రదాడి జరిగితే భారతదేం తగిన సమాధానం ఇస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వాలను, ఉగ్రవాదుల్ని మేము వేరువేరుగా చూడమని స్పష్టం చేశారు.

Exit mobile version