Site icon NTV Telugu

Vaccination: 5-15 ఏళ్ల పిల్లలకు అప్పుడే.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది.. ఇక, 15 ఏళ్లు లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.. ఈ సారి 5 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నారు.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ… కోవిడ్‌ టీకాలపై నిపుణుల బృందం సిఫారసు చేసిన వెంటనే వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు.. దీనిపై ఇప్పటి వరకు ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఎలాంటి సిఫారసు చేయలేదని వెల్లడించారు.. సాధారణ బడ్జెట్‌పై బీజేపీ.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యాకమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఏజ్‌ గ్రూప్‌కు టీకాలు ఎప్పుడు వేయాలో శాస్త్రవేత్తల బృందం సిఫారసుల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

Read Also: Jagga Reddy: సీఎంకి ఎంత మంది తండ్రులని మేం అడగాలా..?

5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ వేయడంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మన్సుఖ్ మాండవీయ.. ఈ వర్గానికి చెందిన టీకాపై నిపుణుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు.. కాగా, దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ వేయడం గత నెలలో ప్రారంభమైన విషయం తెలిసిందే.. టీకాలు వేయడం సమస్య కాదు.. మా దగ్గర సరిపడా వ్యాక్సిన్‌లు ఉన్నాయి, డోస్‌ల కొరత లేదు.. కానీ, మేం ఖచ్చితంగా సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క సిఫార్సును అనుసరిస్తామని తెలిపారు మాండవీయ.. ప్రభుత్వానికి ఇంతవరకు ఎలాంటి సిఫారసు రాలేదని, దాని ఆధారంగానే రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ నిర్ణయం కాదు.. గత ఏడాది జూలై-ఆగస్టులో సెరో సర్వే మరియు సెరో ప్రాబల్య సర్వేలో 67 శాతం మంది పిల్లలు కూడా యాంటీ బాడీలను అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. అంతిమంగా, శాస్త్రవేత్తలు సిఫార్సులు చేసే ముందు అధ్యయనం చేస్తారు. ఇంతకుముందు ప్రపంచ దేశాలను అనుసరించేవాళ్లం.. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు వారి స్వంత విశ్లేషణను నిర్వహిస్తారు. వారి స్వంత అధ్యయనం కలిగి ఉన్నారని.. వాటి ఆధారంగా అభిప్రాయాలను రూపొందించారని వెల్లడించారు.

Exit mobile version