NTV Telugu Site icon

Viral News: భర్తను అమ్మిన భార్య.. శుభలగ్నం సీన్ రిపీట్

Untitled 4

Untitled 4

Viral News: ఐదోతనానికి మించిన ఆస్తి లేదు అంటారు మన పెద్దలు. అష్టయిశ్వర్యాలను ఓ వైపు భర్తను మరో వైపు ఉంచి నీకు ఏది కావాలో తీసుకోమంటే స్త్రీ భర్తనే కోరుకుంటుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. పైసలుంటే చాలు భర్తతో పనేది అందులోనూ తిరుగుబోతు భర్త నాకెందుకు అనుకుంటున్నారు కొందరు మహిళలు. ప్రతి కథ ఓ జీవితమే అన్నట్టు శుభలగ్నం సినిమాని నిజం చేసింది ఓ మహిళ. 5 లక్షల రూపాయలకు తన భర్తను బేరం పెట్టింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక లోని మాండ్య దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో.. ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలిసింది. దీనితో ఆ మహిళ తన భర్త పైన నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో అతను మరో మహిళతో బెడ్ రూమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

Read also:Israel-Hamas War: ఆ ఇద్దరిని వదిలిపెట్టిన హమాస్

అయితే తప్పు చేసిన భర్తను పక్కన పెట్టి తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళతో గొడవ పెట్టుకుంది. చినుకు చినుకు కలిసి గాలి వాన అయినట్టు గొడవ ముదిరి ఊరి పెద్దల ముందు పంచాయితీకి దారితీసింది. ఈ నేపథ్యంలో భార్య భర్త, అతనితో సహజీవనం చేస్తున్న మహిళ పంచాయితీకి హాజరు అయ్యారు. కాగా ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళ మాట్లాడుతూ ఆ వ్యక్తి నాకు 5 లక్షలు బాకీ ఉన్నాడని ఆ పైసలు చెల్లించి తన భర్తను తీసుకు వెళ్లమని కోరింది. దీనికి మండిపడ్డ ఆ భార్య.. ఇలాంటి భర్త నాకు అవసరమే లేదు. నువ్వే నాకు రూ. ఐదు లక్షలు మనోవర్తి కింద ఇవ్వు. అతడిని నువ్వే ఉంచుకో అని చెప్పింది. సదరు మహిళ సరే అని అందుకు ఒప్పుకుని నగదు ఇవ్వడానికి ఒక నెల గడుపు కోరింది. కాగా అందుకు ఆ భార్య అంగీకరించింది. పంచాయతీ పెట్టి వారి ఎదుట చేసుకున్న ఈ ఇద్దరి రాజీ ఒప్పందం పంచాయతీ పెద్దలతో పాటు.. గ్రామస్తులను అవాక్కయ్యేలా చేసింది.