Site icon NTV Telugu

Shocking Incident : సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య

Murder Plan

Murder Plan

Shcoking Incident : మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతున్న సమాజంలో, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది వద్ద భర్త తాయప్పను సెల్ఫీ తీసుకుందామని భార్య చిన్ని నదికట్ట వద్దకు తీసుకెళ్లింది.

Post Office RD Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుత పథకం.. 5 ఏళ్లలో రూ. 35 లక్షలు..

అక్కడ సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను నదిలో తోసేసింది. ఊహించని ఈ దాడి కారణంగా తాయప్ప నదిలో కొట్టుకుపోతూ బయటపడేందుకు తీవ్రంగా యత్నించాడు. అయితే సమయస్ఫూర్తితో స్పందించిన గ్రామస్థులు తాడు సహాయంతో తాయప్పను నది నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. తన భార్య తనను నదిలో తోసిందని ఆరోపిస్తున్న తాయప్ప, ఇది పథకం ప్రకారం పన్నిన కుట్రగా భావిస్తున్నాడు.

ఈ ఘటన అనంతరం భార్య చిన్ని తన భర్త తాయప్ప నదిలో జారిపడ్డాడని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు ఆమె ఇలాంటి పని చేసిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది.

Wimbledon 2025 Final: అల్కరాజ్, సినర్‌ సూపర్.. నెల రోజుల్లోనే ఇద్దరికీ రెండవ ఫైనల్!

Exit mobile version