High Court: తన భర్తని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోవాలని భార్య ఒత్తిడి చేయడం క్రూరత్వానికి సమానమని, ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పదే పదే బహిరంగంగా అవమానించడం, భాగస్వామిని తిట్టడం మానసిక క్రూరత్వమే అని హైకోర్టు పేర్కొంది. ‘‘ విడిగా జీవించాలనే కోరిక క్రూరత్వం కిందకు రాకపోయినా, భర్తను తన కుటుంబంతో సంబంధాలు తెంచుకోవాలని నిరంతరం వేధించడం ఖచ్చితంగా క్రూరత్వమే అవుతుంది.
భర్తను తల్లిదండ్రుల నుంచి దూరంగా చేయడానికి భార్య నిరంతరం ప్రయత్నించడం మానసిక క్రూరత్వం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది’’ అని జస్టిస్ జస్టిస్ అనిల్ క్షేత్రర్‌పాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 16న తీర్పు వెలువరించింది.
Read Also: Anil Chauhan: “నెపోటిజం” లేనిది ఒక్క సైన్యం లోనే: డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్
ఈ ఆరోపణలపై ఫ్యామిలీకోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్ధించింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో జీవించడం తనకు ఇష్టం లేదని భార్య నిరంతరం భర్తపై ఒత్తిడి తెస్తోంది. తన తల్లి, విడాకులు తీసుకున్న సోదరి నుంచి విడివిడిగా జీవించాలని తన భర్తపై ఒత్తిడి తెస్తోందని ధర్మాసనం పేర్కొంది. భర్తను, అతడి కుటుంబాన్ని పదే పదే బెదిరించడం, పోలీసుల ఫిర్యాదు దాఖలు చేయడం అత్యంత స్పష్టమైన క్రూరత్వమే అవుతుందని హైకోర్టు చెప్పింది.
