Madhya Pradesh: భర్త నలుపురంగులో ఉన్నాడని చెబుతూ ఓ భార్య అతడిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లింది. భర్తతో పాటు పేగు తెంచుకుని పుట్టిన పసికందుకు కూడా వదిలేసి వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ భార్యభర్తల పంచాయతీ ఎస్పీ ఆఫీసుకు చేరింది. భార్యభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. భర్త నలుపు రంగులో ఉన్నాడని భార్య చెప్పగా, ఆమె వివాహేతర సంబంధం కారణంగానే తనను వదిలి వెళ్లిందని భర్త ఆరోపించారు.
Read Also: Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?
దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవని తేలింది. సదరు మహిళ నెలన్నర వయసు ఉన్న తన కుమార్తెని అత్తామామల ఇంట్లో వదిలేసి పుట్టింటికి వెళ్లింది. బాధిత వ్యక్తిని విశాల్ మోగియాగా గుర్తించారు. మంగళవారం గ్వాలియర్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మహిళా పీఎస్‌లో డీఎస్పీ కిరణ్‌ని కలిశారు. పెళ్లి జరిగి ఏడాదైనా, ఇటీవల కూతురు పుట్టినా తన భార్య కుటుంబ సభ్యుల్ని వేధించేదని వెల్లడించారు.
విశాల్ కుటుంబీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం, అతని భార్య చాలాసార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని, రైల్వే ట్రాక్‌పై వెళ్లి ఆత్మహత్ చేసుకుంటానని చెప్పేదని, ఆమెను రక్షించే ప్రయత్నంలో విశాల్ తండ్రికి తీవ్రమైన ప్రమాదం జరిగిందని చెప్పారు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉండేందుకు బిడ్డను వదిలేసి వెళ్లిందని విశాల్ ఆరోపించారు. విశాల్ కుటుంబం ఆమె తిరిగి రావడం లేదా శాంతియుతంగా విడిపోవాలని కోరుకుంటున్నారు. తన కొడుకు నల్లగా ఉన్నాడని తన కోడలు అతనితో ఉండేందుకు ఇష్టపడలేదని విశాల్ తల్లి చెప్పింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించడానికి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ సెషన్‌లు త్వరలో ప్రారంభిస్తామని డీఎస్పీ కిరణ్ హామీ ఇచ్చారు.