భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసుండాలని వివాహాలు జరిపిస్తుంటే.. మధ్యలోనే కుప్పకూల్చుకుంటున్నారు. క్షణిక సుఖకోసం భాగస్వాములను అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రియుడితో సుఖం కోసం కోసం కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మరో ఘోరం వెలుగుచూసింది. అచ్చం ‘దృశ్యం’ సినిమా మాదిరిగా జరిగినట్లుగానే జరిగింది.
ఇది కూడా చదవండి: UAE: షార్జాలో మరో విషాదం.. బర్త్‌డే రోజే కేరళ వివాహిత అనుమానాస్పద మృతి
విజయ్ చవాన్(35), కోమల్(28) భార్యాభర్తలు. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలసోపారా తూర్పులోని గడ్గపడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత 15 రోజులుగా విజయ్ చవాన్ కనిపించడం లేదు. అయితే పొరుగింటి యువకుడితో కోమల్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ప్రియుడితో సుఖం కోసం భర్త అడ్డొస్తున్నాడని విజయ్ చవాన్‌ను చంపేసింది. అనంతరం శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టి టైల్స్‌తో మూసేసింది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి.. 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి.. మోడీపై మమత ఫైర్
అయితే తమ సోదరుడు 15 రోజులుగా కనిపించడం లేదన్న అనుమానంతో విజయ్ చవాన్ సోదరులు వెతుక్కుంటూ ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర ఫ్లోర్ టైల్స్ మిగిలిన రంగులకు భిన్నంగా కనిపించాయి. అసలు టైల్స్ రంగుతో సరిపోలలేదు. దీంతో అనుమానం వచ్చి టైల్స్‌ను తొలగించారు. వెంటనే దుర్వాసన రావడం ప్రారంభమైంది. చొక్కా, శవం కనిపించింది. వెంటనే సోదరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విజయ్ చవాన్‌ను భార్య కోమల్, ఆమె ప్రియుడు చంపేసి ఇంట్లో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. ఇక కోమల్, ఆమె ప్రియుడు మోను రెండు రోజులుగా కనిపించడం లేదు. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇద్దర్నీ అనుమానిత నిందితులగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అచ్చం దృశ్యం సినిమా మాదిరిగా నిందితులు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
