Site icon NTV Telugu

Extra-Marital affair: ఇదేం కొట్టుడు అక్కా.. పోలీసు మొగుడ్ని పొట్టుపొట్టు కొట్టిన భార్య.. వీడియో వైరల్..

Wife Beat Husband

Wife Beat Husband

Wife beats husband in Kanpur: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నాయి. దీని వల్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలే కాదు భార్యలు కూడా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్తను చితక్కొట్టింది భార్య. తనకు అన్యాయం చేస్తున్నాడని నడిరోడ్డుపైనే దాడి చేసింది. బట్టలు చింపుతూ.. తిడుతూ పోలీస్ మొగుడిపై తన ప్రతాపాన్ని చూపింది. ఈ మొత్తం వీడియోను స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Read Also: TSPSC : నిరుద్యోగులకు అలర్ట్‌.. జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ వాయిదా..

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో జరిగింది. శుక్రవారం ఉదయం పార్క్ లో అంతా చూస్తుండగా.. సదరు మహిళ తన భర్తపై దాడి చేసింది. అతని బట్టలు చింపేసి మరీ పొట్టుపొట్టు కొట్టింది. ఇలా ఎందుకు కొడుతున్నారని స్థానికులు ప్రశ్నించగా.. నేను అతని భార్యను అని, ఇతనికి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని చెప్పింది. చెంపదెబ్బలు కొడుతూ.. తిడుతూ విశ్వరూపం చూపింది.

కానిస్టేబుల్ అయిన దుర్గేష్ సోంకర్ పై దాడి చేసిన మహిళ అతని రెండో భార్య అని నౌబస్తా పోలీస్ అధికారి జావేద్ ఆలం వెల్లడించారు. మొదటి భార్య ఉన్నప్పటికీ తనను పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య ఫిర్యాదు చేయడంతో ఆతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దుర్గేష్ కు ఇతర మహిాళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని రెండో భార్య ఆరోపిస్తోంది. వీరిద్దరి ఫిర్యాదులను నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Exit mobile version