Site icon NTV Telugu

Wife attacks husband: భర్తపై భార్య దాడి.. కొట్టే ముందు ఏం చేసిందంటే..

Sam (1)

Sam (1)

ఈ కాలంలో సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదు. కొంతమంది భార్యలు తాగుబోతు అన్న కారణంతోనో, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానో భర్తలను హతమారుస్తుంటే మరికొందరు దాడులు చేస్తున్నారు. కొంతమంది అనుమానంతో.. అదనపు కట్నం కోసం వేధించడం వంటివి చేస్తున్నారు. గత రెండ్రోజుల క్రితం నడి రోడ్డుపై భర్తను.. ఓ భార్య పొట్టు పొట్టు కొట్టింది. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ భార్య విడాకుల విషయంలో కోర్టుకు హాజరై వస్తుండగా భర్తను నడీరోడ్డుపై దారుణంగా కొట్టింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. భార్య భర్తను కొట్టే ముందు ఇంట్లోని సీసీ కెమెరాలన్నింటినీ పగలగొట్టింది. భర్తతో గొడవ జరగడంతో కుర్చీ వేసుకుని ఇంట్లోని ఒక్కో సీసీ కెమెరాను కుర్చిపై ఎక్కి కర్రతో పగలగొట్టింది.
అనంతరం భర్తపై దాడి చేయడంతో అతడు పీఎస్ లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు విచారణ జరపగా మహిళ సీసీ కెమెరాలను పగలగొట్టినట్టు విచారణలో బయటపడింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో మగవాళ్లు కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.. హిళలపై దాడులు జరిగితే అనేక చట్టాలు ఉన్నాయని కానీ పురుషులపై దాడి చేస్తే అసలు చట్టాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులు సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.

Exit mobile version