Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ముందు మోకాళ్లపై కూర్చున్న అల్బేనియా ప్రధాని ఏడీ రామా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మెలోని 48వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఆయన అందమైన స్కార్ఫ్ బహూకరించారు. ఈ గిఫ్ట్ ఇచ్చేందుకు మోకాళ్లపై వంగాడు. ఈ ఘటన అబుదాబిలో జరుగుతున్న ‘‘వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్’’లో చోటు చేసుకుంది.
Read Also: Bengaluru: ప్రైవేటు ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. మహిళ టెక్కీ ఆత్మహత్య
అల్బేనియాలో నివసిస్తున్న ఓ ఇటాలియన్ డిజైనర్ ఈ స్కార్ఫ్‌ని రూపొందించడం విశేషం. ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేస్తుంది. నిజానికి జార్జియా మెలోని రైట్ వింగ్ బ్రదర్స్ పార్టీకి లీడర్, రామా అల్బేనియా సోషలిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి రాజకీయ సిద్ధాంతాలు పరస్పర విరుద్ధమైనప్పటికీ, ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటలీకి సముద్రం ద్వారా వస్తున్న వలసదారుల్ని డైవర్ట్ చేయడానికి అల్బేనియాతో గతేడాది మెలానీ ఒప్పందం చేసుకున్నారు. వీరిని అల్బేనియాలోని డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు.
🇦🇱🇮🇹 Albanian PM Edi Rama knelt before Italian PM Giorgia Meloni during their visit to Abu Dhabi, presenting her with a scarf as a birthday gift and referring to her as "Your Majesty".
He also tried to place the scarf over her head like a hijab. pic.twitter.com/QSqEuuBexM
— kos_data (@kos_data) January 15, 2025