Site icon NTV Telugu

Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ఆప్ సర్కార్పై సుప్రీంకోర్టు సీరియస్

Supreme

Supreme

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతూ.. గాలి నాణ్యత అధ్వానంగా మారడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఢిల్లీ- ఎన్సీఆర్‌ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది.

Read Also: RGV: దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ కొట్టివేత..

దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కాసేపట్లో అధికారులతో మంత్రి గోపాల్ రాయ్ భేటీ కానున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలుపై ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు, కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పిటిషన్ కొనసాగింది. ఈ రోజు (సోమవారం) ఢిల్లీలో ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ లో 481 పాయింట్లు నమోదు అయింది.

Exit mobile version