NTV Telugu Site icon

Footwear: ఆగస్టు 1 నుంచి పెరగనున్న ‘ఫుట్‌వేర్’ ధరలు.. కారణం ఏంటంటే..?

Footwear

Footwear

Footwear: ఆగస్టు నుంచి చెప్పులు, షూస్ వంటి ఫుట్‌వేర్ ఉత్పత్తుల రేట్లు పెరగబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త నాణ్యత ప్రమాణాలు పాదరక్షల్ని మరింత ఖరీదైనవిగా మార్చబోతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) విడుదల ప్రకారం, మార్కెట్ విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారీ కావాలి. పాదరక్ష తయారీదారులు IS 6721 మరియు IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని కోరుతూ, కొత్తగా తీసుకువచ్చిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) ఆగస్టు 1, 2024 నుండి అమలు చేయబడుతుంది.

Read Also: Maharashtra: అడవిలో గొలుసులతో బందీగా అమెరికా మహిళ.. రక్షించిన గొర్రెల కాపరి..

ఈ నేపథ్యంలో నాణ్యత విషయంలో రాజీ పడకపోవడంతో ఫుట్‌వేర్ ఉత్పత్తుల ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న తయారీదారులకు BIS కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. పాదరక్షల పాత స్టాక్‌కి కూడా ఈ నియమాలు వర్తించవు. విక్రేతలు BIS వెబ్‌సైట్‌లో పాత స్టాక్ వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 46 అంశాలు ఆగస్టు 1 నుంచి సవరించిన BIS నిబంధనల పరిధిలోకి వస్తాయి. అవగాహన కోనం తమ వైబ్‌సైట్‌లో సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లుగా బ్యూరో వెల్లడించింది.

సవరించిన నాణ్యతా నియమాల ప్రకారం.. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి ఫుట్‌వేర్ తయారీలో ఉపయోగించి ముడిపదార్థాల రసాయన లక్షణాల కోసం పరీక్షించాల్సి ఉంటుంది. బయటి భాగాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం యొక్క బలం, ప్లెక్సిబిలిటీ కఠిన పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు ఫుట్‌వేర్ ఉత్పత్తులను మరింత నాణ్యమైనవిగా మారుస్తాయి. మెరుగైన మెటీరియల్ ఉపయోగించడం వల్ల తయారీ వ్యయం పెరుగుతుంది. దీంతో ఫుట్‌వేర్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.