Kamal Haasan: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ కొత్త భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రపతిని కాాదని, ప్రధాని నూతన పార్లమెంట్ ను ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, జేడీయూ వంటి 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. మరోవైపు మాయావతి బీఎస్పీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ అయిన బీజేడీ, అకాలీదల్, మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జేడీయూలు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.
Read Also: North Korea: బైబిల్‌తో పట్టుబడిన తల్లిదండ్రులకు మరణిశిక్ష..2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు
ఇదిలా ఉంటే ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. జాతీయ అహంకారంతో కూడిన ఈ క్షణం రాజకీయంగా విభజనగా మారిందని అని అన్నారు.‘‘ నేను ప్రధానిని ఓ ప్రశ్న అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి.. మన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదు…’’ అని అడిగారు. దేశాధినేతగా ఉన్న రాష్ట్రపతి ఈ చారిత్రాత్మ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి నాకు కారణం కనిపించడం లేదని కమల్ హాసన్ అన్నారు.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటానని, అయితే భారత రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం మరియు ప్రారంభోత్సవ ప్రణాళికలో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తానని అన్నారు.
