Site icon NTV Telugu

Kishori Lal Sharma: అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరి లాల్ శర్మ.. ఎవరు ఇతను..?

Kishori Lal Sharma

Kishori Lal Sharma

Kishori Lal Sharma: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీకి అభ్యర్థుల్ని ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఇన్నాళ్లు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయిన తర్వాత వయనాడ్ నుంచి పోటీ చేసిన ఆయన మళ్లీ ఉత్తర ప్రదేశ్ నుంచి బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే అమేథీ నుంచి కాంగ్రెస్ తరుపున స్మృతీ ఇరానీపై కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇతని గురించి ఆసక్తి నెలకొంది.

Read Also: CM YS Jagan: మేనిఫెస్టో అంటే ఒక చెత్త ముక్క కాదు.. పవిత్ర గ్రంథం..

కిషోరీ లాల్ శర్మ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. గత నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో అనుబంధం ఉంది. పంజాబ్ లూథియానాకు చెందిన ఈయన 1983లో రాజీవ్ గాంధీతో కలిసి రాయ్‌బరేలీ, అమేథీలో అడుగుపెట్టారు. మే 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత గాంధీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మారారు. ఈ రెండు ఎంపీ స్థానాల్లో కీలక విషయాలు చూసుకుంటున్నాడనే పేరు ఇతని ఉంది. సోనియాగాంధీ రాజకీయాల్లో వచ్చిన తరుణంలో ఆమె వెన్నంటే నిలిచారు. సోనియా గాంధీ అమేథీ సీటును రాహుల్ గాంధీకి వదిలిపెట్టి, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన తర్వాత కిషోరి లాల్ శర్మ అమేథీ మరియు రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించారు.

శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో రాయ్‌బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిషోరీ లాల్ శర్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు ఐదో దశలో మే 20న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

Exit mobile version