NTV Telugu Site icon

Allahabad HC: భార్య భర్త లైంగిక కోరికలు తీర్చకుంటే.. అతను ఎక్కడికి వెళతాడు..?

Allahabad Hc

Allahabad Hc

Allahabad HC: ఒక వ్యక్తిపై భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపుల ఆరోపణల్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపబ్టింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆమె ఆరోపణలు చేసిందని కోర్టు భావించింది. మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు మహిళ ఆరోపణల్ని కొట్టిపారేసింది. వరకట్న వేధింపులతో పాటు తన భర్త అసహజ సెక్స్‌కి బలవంతంగా చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలు అన్నింటి కోర్టు కొట్టివేసింది.

ఈ కేసును విచారిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ నైతికంగా నాగరిక సమాజంలో వారి భాగస్వామి(భర్త లేదా భార్య) వారి లైంగిక కోరికలను తీర్చకుంటే, ఎక్కడికి వెళతారు’’ అని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో సమర్పించిన సాక్ష్యాలు మరియు సాక్షుల వాంగ్మూలాలు వరకట్న వేధింపుల వాదనలను సమర్ధించలేదని గుర్తించిన జస్టిస్ అనీష్ పేర్కొన్నారు. కుమార్ గుప్తా ప్రాంజల్ శుక్తా, మరో ఇద్దరిపై నమోదైన కేసును కొట్టివేశారు.

Read Also: RSS Chief: ‘‘డీప్ స్టేట్, గాజా, బంగ్లాదేశ్, హమాస్’’.. దసరా స్పీచ్‌లో మోహన్ భగవత్ కీలక కామెంట్స్..

ఈ కేసులో ప్రాథమిక ఆరోపణలు జంట లైంగిక సంబంధం, కొన్ని లైంగిక చర్యలకు భార్య నిరాకరించడం చుట్టూ కేంద్రీకృతమైందని కోర్టు పేర్కొంది. ఈ ఆరోపణలు వరకట్న వేధింపులను సూచించడం లేదని, భార్యభర్తల మధ్య వ్యక్తిగత విభేదాలను సూచిస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. ‘‘ఇద్దరి మధ్య వివాదం లైంగిక అననుకూలతకు సంబంధించిన వివాదంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఆ కారణం ఇప్పుడు వరకట్న వేధింపుల డిమాండ్‌కి సంబంధించి తప్పుడు, కల్పిత ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదుకి కారణమైంది.’’ అని కోర్టు చెప్పింది.

‘ఒక పురుషుడు తన భార్య నుంచి లైంగిక ప్రయోజనాలు కోరినట్లయితే, నైతికంగా నాగరికత కలిగిన సమాజంలో వారి శారీరక లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వారు ఎక్కడికి వెళతారు..?’’ అని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ మీనా శుక్లా తన భర్త ప్రాంజల్ శుక్లాపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో, ఆమె అసహజ సెక్స్‌లో పాల్గొనడం మరియు అశ్లీల చిత్రాలను చూడడం వంటి దుర్వినియోగ ప్రవర్తనను ఆరోపించింది.

ఎఫ్ఐఆర్‌లో ప్రాంజల్ మద్యం సేవించేవాడని, పోర్న్ సినిమాలు చూసేవాడని, తన భార్యతో అసహజ సెక్స్‌కు పట్టుబట్టేవాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆమె ఇదే విషయాన్ని వ్యతిరేకించినప్పుడు, అతను ఆమె అభ్యంతరాలను పట్టించుకోలేదని ఎఫ్ఐఆర్‌ పేర్కొంది. భార్యను వదిలేసి భర్త సింగపూర్ వెళ్లిన విషయాన్ని ఎఫ్ఐఆర్‌ పేర్కొంది. ఈ కేసులో మీనా తన అత్తామామలు మధు శర్మ, పుణ్య శీల్ శర్మలపై కూడా కేసులు పెట్టింది. పెళ్లికి ముందు వరకట్న డిమాండ్ చేయలేదని ఎఫ్ఐఆర్‌లో ఉంది. ఎఫ్ఐఆర్‌లో మీషా సాధారణ, అస్పష్టమైన ఆరోపణలు చేసినట్లు కోర్టు గుర్తించింది.