NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* మహిళల టీ20: నేడు భారత్‌-శ్రీలంక మధ్య మ్యాచ్.. రాత్రి 7 గంటలకు ప్రారంభం

* నేడు భారత్-బంగ్లాదేశ్‌ మధ్య రెండో టీ20 మ్యాచ్‌.. రాత్రి 7 గంటలకు ఢిల్లీ వేదికగా మ్యాచ్

* అమరావతి: ఉదయం 9.25కి ఢిల్లీ నుంచి బయల్దేరనున్న చంద్రబాబు. ఉదయం 11.40కి గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు ఏపీ సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు నివాసానికి చేరుకోనున్న సీఎం.. మధ్యాహ్నం 2.00 గంటలకు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు.

* తిరుమల: నేడు 6వ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై మలయప్పస్వామి దర్శనం.. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారి దర్శనం.. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారి దర్శనం

* ఏపీ: నేటి నుంచి రైతుబజార్లలో రాయితీ ధరకు టమాటా విక్రయం.. రాయితీ ధరకు టమాటా విక్రయించనున్న ఏపీ ప్రభుత్వం..

* నిర్మల్: బాసర సరస్వతి ఆలయంలో మూల నక్షత్ర వేడుకలు.. వేకువ జాము నుంచే భక్తుల దర్శనాలు.. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు. అమ్మవారి జన్మ నక్షత్రం, మూల నక్షత్రం విశిష్ట దినం కావడంతో ఇవాళ చిన్నారుల అక్షర శ్రీకర పూజలకు భక్తులు.

* విజయవాడ-శ్రీకాకుళం మధ్య దసరాకు ప్రత్యేక రైళ్లు.. విజయవాడ నుంచి రాత్రి 8 గంటలకు, శ్రీకాకుళం నుంచి ఉదయం 6.30కి ప్రత్యేక రైళ్లు.. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు నడవనున్న రైళ్లు..

* విజయనగరం: ఉదయం 8 గంటలకు ఘోషా హాస్పిటల్ వద్ద అన్న క్యాంటిన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలక్టర్ కార్యాలయంలో మీటింగులో పాల్గొంటారు.. 11.30 గంటలకు డెంకాడ మండలం, నాతవలసలో ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అభినందన సభలో పాల్గొనున్నారు.. సాయంత్రం 4.00 గంటలకు జిల్లా కలక్టర్ కార్యాలయంలో మీటింగులో పాల్గొంటారు

* విజయనగరం: ఎస్వీఎన్ లేఅవుట్ లో గల సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో నేడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

* నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి..

* రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా 7వరోజు.. కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

* నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రులు .. మూల నక్షత్రం అమ్మవారు కాళరాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనం.. విశేష మూలానక్షత్ర యుక్త అష్టోత్తరనామార్చన – కిచిడి నివేదన

* కర్నూలు: కాల్వబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలపై మూడవ రోజు కొనసాగనున్న విచారణ

* నంద్యాల: మహానందిలో నేడు శేష వాహనంపై కాళరాత్రి దుర్గ అలంకారంలో దర్శనం ఇవ్వనున్న కామేశ్వరి అమ్మవారు..

* నంద్యాల: నేడు శ్రీశైలంలో 7వరోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. గజవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం

* నేడు కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్థి పై చర్చించనున్న నేతలు.. కూటమి తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీ డీ పీ నేత పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థితత్వం దాదాపు ఖరారు

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. సీఎంతో పాటు NSG అనుమతిచ్చిన వారికి మాత్రమే ఆలయంలోనికి అనుమతి.. ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ దర్శనం‌ చేసుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. సీఎం, డిప్యూటీ సీఎం ల రాక కారణంగా సామాన్య భక్తుడి దర్శనం నిలుపుదల ఉండదన్న దేవాదాయ శాఖామంత్రి.. సాయంత్రం 4 గంటల తరువాతే వీఐపీ దర్శనాలకు అనుమతి

* చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటా పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. కేజీ 49 రూపాయలకే టమోటా ప్రజలకు ఇవ్వనున్న మార్కెటింగ్ శాఖ

* శ్రీసత్యసాయి: లేపాక్షిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర దేవాలయంలో సరస్వతి దేవి అలంకారం భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు మూల నక్షత్రం కావడంతో రాజమండ్రి దేవిచౌక్ శరన్నవరాత్రి మహోత్సవాల్లో సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. 7వ రోజు సరస్వతి దేవిగా ప్రత్యేక అలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్న అమ్మవారు

* గుంటూరు: నేడు వేజెండ్ల ప్రాంతంలో రైల్వే పోలీస్ , ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల మాక్ డ్రిల్ … ప్రమాదాలు జరిగితే ప్రయాణికులను ఎలా కాపాడాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి అన్న అంశాలపై రైల్వే ఉన్నతాధికారుల సమక్షంలో ప్రదర్శన చేయనున్న రైల్వే బృందాలు…

* ప్రకాశం : త్రిపురాంతకంలో 7వ రోజు శ్రీ బాల త్రిపురసుందరి దేవి మరియు శ్రీ పార్వతి దేవి అమ్మవార్ల శరన్నవరాత్రుల మహోత్సవాలు.. శ్రీ కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు.. రాత్రికి పల్లకి సేవ గజవాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.