NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు.. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్‌ ఫలితాలు.. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ.. జమ్మూకశ్మీర్‌లోని 90 స్థానాల్లో 873 మంది అభ్యర్థుల పోటీ.. 63.45 శాతం పోలింగ్‌ నమోదు.. హర్యానాలోని 90 స్థానాలకు 1,031 మంది పోటీ.. 67.90 శాతం పోలింగ్‌ నమోదు.

* నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఢిల్లీలో కీలక సమావేశం.. ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులతో ఏపీ ప్రభుత్వం చర్చలు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు

* ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీ.. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు.. ఈ రోజు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌, హర్దీప్ సింగ్ పూరి, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్న ఏపీ సీఎం

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు.. రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనం.. అనంతరం మధ్యరాత్రి నుంచే సరస్వతీదేవిగా దర్శనం ప్రారంభం..

* పల్నాడు: నేడు వినుకొండ మండలం విఠంరాజుపల్లి ఐటీఐ కాలేజ్ లో జాబ్ మేళా..

* శ్రీ సత్యసాయి : పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి సవిత.

* ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్.

* శ్రీసత్యసాయి : లేపాక్షిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అలంకారం భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

* విశాఖ: టమోటా ధరలపై ప్రభుత్వం నియంత్రణ… రేపటి నుంచి KG 50రూపాయలకు అమ్మేలా రైతు బజార్లకు ఆదేశాలు. ఆధార్ కార్డు పై KG టమాటాలు విక్రయం…

* నేడు శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సీడబ్ల్యుసీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు.. రూ.203 కోట్ల డ్యామ్ మరమ్మతుల పనుల ప్రతిపాదనలో పేజ్ 1 కింద రూ.102 కోట్ల పనుల వివరాలను సేకరించనున్న అధికారులు.. జలాశయాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించనున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

* కర్నూలు: మంత్రాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు గ్రామ దేవత మంచాలమ్మకు కుంకమ అర్చన, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు.

* నంద్యాల: నేడు శ్రీశైలంలో 6వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం కాత్యాయని అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. హంసవాహనంపై పుష్పపల్లకిలో పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి, అమ్మవారు పుష్పపల్లకిలో గ్రామోత్సవం

* విజయవాడ: నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లి నివాసానికి రానున్న జగన్.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయ ప్రకాశ్ ఇంటికి వెళ్లనున్న జగన్.. జయప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి తాడేపల్లి నివాసానికి రానున్న జగన్

* తిరుపతి: గరుడసేవ నేపథ్యంలో నగరంలో పలు చోట్లా ట్రాఫిక్ మళ్ళింపు… అలిపిరి సమీపంలోనే పార్కింగ్ కోసం ఐదు ప్రత్యేక ప్రదేశాలను కేటాయించిన పోలీసులు.

* అమరావతి: మద్యం దుకాణాలకు ఏపీ వ్యాప్తంగా 20310 దరఖాస్తులు.. సోమవారం ఒక్కరోజే 12036 దరఖాస్తులు.. దరఖాస్తుల సమర్పనకు ఇవాళ, రేపు మాత్రమే చివరి రోజులు కావడంతో మరిన్ని వచ్చే ఛాన్స్

* విజయనగరం: నేడు ఉదయం 8 గంటలకు విజ్జి స్టేడియంలో జరుగు అభివృద్ధి పనులు పరిశీలించనున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. పైడితల్లమ్మవారి పండుగా సందర్భంగా నిర్వహించనున్న క్రీడా మైదానాన్ని పరిశీలించనున్న మంత్రి.

* ఏలూరు: ఈ నెల 13నుంచి 20వ తేదీ వరకు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వయుజ బ్రహ్మోత్సవాలు..

* విశాఖ: నేటి నుంచి మలబార్ 2024 నౌకాదళ విన్యాసాలు.. ఈనెల 18 వరకు హార్బర్, సీ ఫేజ్ లో జరగనున్న విన్యాసాలు.. మలబార్ 2024లో పాల్గొంటున్న అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ నౌకా దళాలు

* విశాఖ: నేడు స్టీల్ ప్లాంటు పై ఢిల్లీలో కీలక సమావేశం.. ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్చలు. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కార్మికులు.. స్టీల్ ప్లాంట్ వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులు పంపిన యాజమాన్యం…..

* బాపట్ల కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర 2047- బాపట్ల విజన్ నూతన ఆవిష్కరణల కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమావేశం.. హాజరుకానున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తదితరులు.

* ఖమ్మం: నేడు జిల్లాల్లో మంత్రులు భట్టి విక్రమార్క , పొంగులేటి లు పర్యటన

* మెదక్: ఏడు రోజులుగా జలదిగ్బంధంలో ఏడు పాయల ఆలయం.. సింగూరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు.. రాజగోపురంలోనే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు.. కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న వనదుర్గా భవాని

* రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఆరవరోజు కాత్యాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

* రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడలో నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా వేములవాడలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఇక్కడి మహిళలకు పుట్టింట్లో, మెట్టినింట్లో రెండు చోట్ల బతుకమ్మ వేడుకలు జరుపుకునే అవకాశం…

* వేములవాడ: మూలవాగులో సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులు… వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్,