* ఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.. హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు, హోంశాఖ మంత్రులు
* తిరుమల: నాలుగో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై మలయ్యప్పస్వామి దర్శనం.. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* గుంటూరు: తెనాలిలో నేటి నుంచి 12వ తేదీ వరకు జాతీయస్థాయి నాటిక, నాటక పోటీలు.. నేటి నుంచి ఆరు రోజులు పాటు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న పోటీలు.. ఈ నెల 12న జాతీయ రంగస్థల పురస్కారాల ప్రధానం…
* తిరుమల: బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు గరుడ వాహన సేవ.. ఇవాళ నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రవైట్ ట్యాక్సిలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిరాకరణ.. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహానాలకు అనుమతి నిలిపివేత.. రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు,నడకమార్గం తెరిచి వుంచనున్న టిటిడి
* శ్రీ సత్యసాయి : పెనుకొండలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత.
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభం.
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 5వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం స్కందమాత అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. శేషవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం
* తూర్పుగోదావరి జిల్లా: బాలత్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాజమండ్రి దేవిచౌక్ లో పొటెత్తిన భక్తులు.. ఐదవ రోజు బాలత్రిపుర సుందరీ దేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు .. ప్రత్యేక అలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్న బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారు
* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 9 గంటలకు కడియం మండలం, దామిరెడ్డిపల్లి గ్రామంలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. 10 గంటలకు కడియం మండలం, కడియం గ్రామంలో దసరా మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు. 10:30కి గంటలకు రాజమహేంద్రవరం నందు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ 2024 కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయం నందు అందుబాటులో ఉంటారు..
* గుంటూరు: నేడు అమరావతి మండల పరిషత్ కార్యాలయంలో ,పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా దర్బార్…
* గుంటూరు: నేడు తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ.. ప్రజా సమస్యల పరిష్కారానికి హాజరుకానున్న, జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితర ఉన్నతాధికారులు.
* కర్నూలు: నేటి నుంచి దేవరగట్టు ఉత్సవాలు ప్రారంభం.. హోళగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో 16వ తేదీ వరకు ఉత్సవాలు.. శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను నెరణీకి నుండి తీసుకొని వెళ్లి దేవరగుట్టు లో గణపతి పూజ, స్వామివారికి కంకణదారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం..