* నేడు వరల్డ్ క్యాన్సర్ డే
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. కేబినెట్ ముందుకు కులగణన, ఎస్సీ వర్గీకరణ, డెడికేషన్ కమిటీ నివేదికలు.. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీ సమావేశంలో చర్చ
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన.. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం. రైతులకు రుణాలు, బ్యాంకర్ల పాత్రపై చర్చ.. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో బ్యాంకర్లకు సూచనలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు.
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చ..
* నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ
* తిరుపతి: నేడు పద్మావతి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న పద్మావతి అమ్మవారు.. ఉత్సవాల సందర్భంగా నేడు ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
* శ్రీకాకుళం: అరసవల్లి శ్రీసూర్యనారాయణ క్షేత్రంలో ప్రారంభమైన రధసప్తమి ఉత్సవాలు.. పట్టువస్ర్తాలు సమర్పించిన ఎండోమెంట్ కమీషనర్ వినయచంద్. ప్రారంభమైన క్షీరాభిషేకం.. ఉదయం ఏడు గంటల వరకూ కొనసాగనున్న క్షిరాభుషేకం. అనంతరం స్వామివారి నిజరూపదర్శనం చేసుకోనున్న భక్తులు
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ , ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ , ఉదయం 11 గంటలకు గరుడ వాహనసేవ , మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ , మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం , సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
* కాకినాడ: నేడు ఉదయం 11 గంటలకు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక.. నిన్న మున్సిపాలిటీలో ఘర్షణ వాతావరణం ఉండడంతో నేటికి వాయిదా వేసిన అధికారులు.. మున్సిపాలిటీలో 30 స్థానాలు, రెండు ఖాళీలు.. 28 కౌన్సిలర్లుకు అందరూ వైసీపీ కౌన్సిలర్లు.. ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా టిడిపి ఎమ్మెల్యే దివ్య
* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో ఉంటారు..
* ప్రకాశం : మార్కాపురం లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఒకే రోజు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి వారు.. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం.. 9 గంటలకు – శేష వాహనం… 11 గంటలకు – గరుడ వాహనం… మధ్యాహ్నం 1 గంటకు – హనుమంత వాహనం.. 2 గంటలకు – చక్రస్నానం.. సాయంత్రం 3 గంటలకు – కల్పవృక్ష వాహనం…5 గంటలకు – రజిత రథోత్సవం (వెండి రథం).. రాత్రి 8 గంటలకు – చంద్రప్రభ వాహనం..
* నేడు అన్నవరంలో రథసప్తమి వేడుకలు, కొండపై కార్యక్రమం.. సూర్య నమస్కారాలు ,ఇతర పూజ కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు
* కాకినాడ: గొల్లల మామిడాడ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. తీర్థ బిందెలతో ఆలయ ప్రవేశం చేసి స్వామివారికి పంచామృతాభిషేకాలు.. మూల విరాట్ కు ప్రత్యేక అలంకరణ, వేరు పిడకలతో స్వామివారికి ఇష్టమైన పరమాణ్ణాన్ని వండుతున్న భక్తులు..మధ్యాహ్నం రథోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు
* పల్నాడు జిల్లా: నేడు పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక.. 11 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నిక… నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా
* ఎన్టీఆర్ జిల్లా: నేడు నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక.. నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికీ వాయిదా.. ఎమ్మెల్యే ఎంపీ మధ్య అభ్యర్థి విషయంలో రాని ఏకాభిప్రాయం.. నేడు ఏం జరుగుతుందా అనే టెన్షన్
* నేడు కడప జిల్లాకు ఇన్చార్జి మంత్రి సవిత రాక.. డీఆర్‌సీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి సవిత..
* రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అనంతపురం : రథసప్తమి సందర్భంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లను గరుడ వాహనంపై ఊరేగింపు.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో శ్రీపేట వెంకటరమణుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. 15 నేడు స్వామివారికి కలశస్థాపన.