Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. నేడు పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించనున్న రాష్ట్రపతి

* నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తో సహా మరికొందరికి సంతాపం తెలపనున్న పార్లమెంట్

* రేపు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

* హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్‌.. ఉదయం 11.54 గంటలకు గోషామహల్ లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనానికి శంకుస్థాపన.. మధ్యాహ్నం 3.30కు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం, మొగిలిగిద్ద హైస్కూల్ 150వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.45 కు రవీంద్రభారతిలో గద్దర్ జయంతి
వేడుకలకు హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.

* అమరావతి : ఇవాళ ఉదయం 9 గంటలకు లండన్ నుంచి బెంగుళూరుకు చేరుకోనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఫిబ్రవరి 3వ తేదీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం.. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యే అవకాశం..

* బాపట్ల : కోరిసపాడు మండలం మేదరమెట్లలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* ప్రకాశం : మార్కాపురం లోని సీపీఐ కార్యాలయంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో పూలసుబ్బయ వెలిగొండ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం..

* అనంతపురం : ఉరవకొండలో పర్యటించనున్న మంత్రి పయ్యావుల కేశవ్.

* శ్రీ సత్యసాయి : పెనుకొండలో ఆర్టీసీ బస్సు సర్వీస్ లను ప్రారంభించనున్న మంత్రి సవిత.

* శ్రీకాకుళం.. ‌ ఇచ్ఛాపురంలో నేడు హిందూ ధార్మిక మహా‌సభ.. శ్రీ విజయ వారాహి యాగం.. పాల్గొననున్న పలువురు పీఠాధిపతులు .

*రేపు అన్నమయ్య జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక… రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్న సీఎం .. ఫిబ్రవరి 1న సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం…

* అనంతపురం : సోమలదొడ్డి సమీపంలోని నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న చరణ్ మృతి మరణం పై సమగ్రమైన విచారణ చేయాలంటూ ప్త్రెవేట్ విద్యా సంస్థల బంద్ కు పిలుపు నిచ్చిన ఐక్య విద్యార్థి సంఘాలు.

* నేడు గుంటూరులో పర్యటించనున్న మాజీ కేంద్రమంత్రి చింతామోహన్…

* విజయవాడ: నేడు డీజీపీ ద్వారక తిరుమల రావు పదవీ విరమణ.. ఘనంగా నేడు వీడ్కోలు చెప్పనున్న అధికారులు

* విజయవాడ: నేడు ఏపీ నూతన డీజీపీ గా బాధ్యతలు చేపట్టనున్న హరీష్ కుమార్ గుప్తా

* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. రథసప్తమి ఏర్పాట్లపై సమిక్షించనున్న పాలకమండలి

* తిరుమలలో 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 51,349 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 14,082 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు

* గుంటూరు: నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం…

* పశ్చిమ గోదావరి జిల్లా: నేడు పెనుగొండలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన.. వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు.. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం..

* విజయనగరం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేటి షెడ్యూల్.. ఉదయం 8.00 గంటలకు గజపతినగరం పార్టీ కార్యాలయంలో గజపతినగరం మండలం క్లస్టర్ – 4 ముఖ్య
నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.. సాయంత్రం 7.00 గంటలకు రాజాంలో గల యస్.ఆర్. కన్వెన్షన్ లో జరిగే వివాహ మహోత్సవ కార్యక్రమములో పాల్గొంటారు.

* విజయనగరం: గజపతినగరం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెంటాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు ఉద్యోగ మేళా… పదో తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా విద్యా ర్హత కలిగినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపు

* విజయనగరం: సత్వర కేసుల పరిష్కారానికి మార్చి 8న జరగనున్న మెగా లోక్అదాలత్ కార్యక్రమం ప్రాధాన్యతను కక్షిదారులకు తెలియపరచాలని కీరగటు ఆవరణలో నాయవాదులకు నేడు సమావేశం.. ఎక్కువ కేసులు పరి ష్కారం అయ్యేలా సహకారం అందిం చాలని కోరుతున్న గజపతినగరం మొదటి తరగతి సివిల్ జడ్జి బి. కనకలక్ష్మి ..

* ఏపీలో ఇవాళ కూడా కిటకిట లాడనున్న రిజిస్ట్రార్ ఆఫీసులు.. పాత మార్కెట్ రేట్లతో రిజిస్ట్రేషన్లకు ఇవాళ చివరి రోజు.. రేపటి నుంచి ఏపీలో అమల్లోకి రానున్న కొత్త మార్కెట్ ధరలు.. నిన్న రాత్రి వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

* తిరుపతి: నేడు జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన.. జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం… నగర డిప్యూటీ మేయర్ ఎన్నికపై చర్చించే అవకాశం… రేపు మహాశివరాత్రి వేడుకలపై సమీక్ష

* శ్రీ సత్యసాయి : హిందూపురంలో నేడు వాసవి ధర్మశాలలో వాసవి క్లబ్ నూతన సంఘం ఎన్నిక కార్యక్రమం

* అనంతపురం: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మ అర్పణ దినోత్సవం, ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు.

* భద్రాద్రి: నేడు బుర్గంపహాడ్ మండలం సారపాక లోని ఐటీసీ కర్మాగారం లో గుర్తింపు సంఘం ఎన్నికలు

Exit mobile version