NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు మూడు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య పట్టాలు ఎక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు..

* ఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే జిల్లా న్యాయసేవాధికార సంస్థ జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ వేడుకను నిర్వహిస్తోన్న సుప్రీంకోర్టు..

* నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..⁠ ఓర్వకల్లులో పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు.

* నేడు సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన.. అమీన్‌పూర్ మండలంలోని పలు చెరువులని పరిశీలించనున్న హైడ్రా కమిషనర్.. అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను గుర్తించనున్న అధికారులు

* మంచిర్యాల జిల్లాలో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన. చెన్నూరు మండలం శివ లింగపూర్ గ్రామంలో 78 ఎకరాల విస్తీర్ణంలో సింగరేణి సంస్థ ఏర్పాటుచేసిన 11 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం.. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శన.

* ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..

* నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని రాయపుపాలెం ..ఎన్టీఆర్ నగర్ లలో పెన్షన్లను పంపిణీ చేయనున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

* తిరుమల: రేపటి నుంచి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించనున్న టీటీడీ.. రేపటి నుంచి పుష్కరిణి హరతి పునఃరుద్దరణ..

* బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో ఏర్పడనున్న వాయుగుండం…. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంపై బలపడుతున్న తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారిన తర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే ఛాన్స్.. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు.. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. మత్స్యకార్ల వేట నిషేధం…

* అనంతపురం : నేడు గుత్తి మున్సిపాలిటీలో సాధారణ కౌన్సిల్ సమావేశం.

* అనంతపురం : గుంతకల్ మండలం కసాపురం గ్రామంలోనే శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ నాలుగో శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు.

* నేడు కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక.. నేటి నుంచి మూడు రోజులు పాటు జిల్లా లో పర్యటించనున్న జగన్.. పెండ్లిమర్రి మండలంలోని మాచనూరు గ్రామంలో వైసీపీ లీడర్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్.. గొందిపల్లి గ్రామంలో పర్యటన.. రాత్రికి పులివెందులలో బస

* విజయవాడ: ముంబై సినీ నటి జత్వానీ తండ్రి నుంచి నేడు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు.. నిన్న జత్వానీ, ఆమె తల్లి నుంచి 3 గంటల పాటు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ముంబైకి జత్వానీ ఫ్యామిలీ

* గుంటూరు: నేడు తాడేపల్లిలో పెట్టుబడుల సదస్సు లో పాల్గొననున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…

* నేడు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం… ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు రెండు ఎకరాల భూమిని రెన్యువల్ విధానంలో కేటాయించే అంశంపై కౌన్సిల్లో జరగనున్న చర్చ…

* గుంటూరు: నేడు తెనాలిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నాదెండ్ల మనోహర్…

* గుంటూరు: నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం…

* కృష్ణా: గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లో హిడెన్ కెమెరాల ఆరోపణలపై రెండు కమిటీలు ఏర్పాటు.. పోలీస్ విచారణ కోసం అధికారులతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు.. మరోవైపు JNTU కాకినాడ వారి ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు

* విజయనగరం: జామి అన్నాంరాజు పేట వేణుగోపాల స్వామి ఆలయంలో నేడు కుంకుమార్చన..

* విజయనగరం: నేడు బొండపల్లి మండలం గొట్లాం గ్రామ పంచాయితీ మధుర జి.యన్.వలస గ్రామంలో ఫించన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్

* అనంతపురం : వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల గ్రామంలో ఆదిచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామి వారి వసంతోత్సవం.

* శ్రీకాకుళం: నేడు నేడు టెక్కలి మండలం రావివలస గ్రామంలో సామాజిక పింఛ‌న్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు..

* శ్రీ సత్యసాయి : పరిగి మండల కేంద్రంలో సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి సవితమ్మ

* వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం.. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

* అనంతపురం : ఆత్మకూరు మండలంలోని బి.యాలేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

* తిరుమల: 17 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,080 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,394 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.8 కోట్లు