NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడుతుందని అంచనా.. వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణకోస్తాకు భారీ వర్ష సూచన.. పలు చోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం

* రాజన్నసిరిసిల్ల జిల్లా: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదస రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు.. పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకములు నిర్వహించిన ఆలయ అర్చకులు

* హైదరాబాద్‌: బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఎమ్మెల్యేలను అనర్హులుగా హైకోర్టు ప్రకటించాలని పిల్.. నేడు విచారణ

* వరంగల్, ములుగు జిల్లాలో నేడు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క పర్యటన.. కన్నాయి గూడెం మండలం దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు.. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ పయనం.

* ప్రకాశం : ఒంగోలులో వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొంటారు..

* ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్నీ ఎంఈవో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా.. గిద్దలూరు ఆర్టీసీ డిపో ఎదుట సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా..

* బాపట్ల : చీరాలలో కార్యకర్తలతో నేడు ఎమ్మెల్సీ పోతుల సునీత సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు..

* తిరుపతి: నేడు శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

* తిరుపతి: నేడు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు.

* కర్నూలు: రేపు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు.. పుచ్చకాయలమాడలో ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.. కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకొని స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి

* పల్నాడు: నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.. నరసరావుపేట మండలం, కాకానిలో జేఎన్టీయూ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం.. జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..

* విశాఖ: వాయుగుండం, భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తమైన GVMC… ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ ఆదేశాలు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. జీవీఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 4250 0009

* గుంటూరు: నేడు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ,తెనాలి మండలం ,ఎరుకలపూడిలో మొక్కలు నాటనున్న మంత్రి నాదెండ్ల మనోహర్…

* నంద్యాల: మహానంది క్షేత్రం లో నేడు కామేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు, సాయంత్రం పల్లకి సేవ

* నంద్యాల: నేడు మున్సిపల్ కౌన్సిల్ మీట్

* నంద్యాల: నేడు పచ్చదనం ర్యాలీని ప్రారంభించనున్న మంత్రి ఫరూక్

* విశాఖలో రెండో రోజు మంత్రి నారా లోకేష్‌ పర్యటన… భీమిలి, తూర్పు నియోజకవర్గ పరిధిలో స్కూళ్లను ఆకస్మిక తనిఖీకి వెళ్లే అవకాశం

* శ్రీకాకుళం: నేడు పలాస పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ సాధారణ సర్వ సభ్య సమావేశం‌

* కాకినాడ: నేడు పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. 12 వేలు మంది మహిళలకి చీరలు కానుకగా పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. సరస్వతి దేవి మందిరము, చండి హోమం జరిగే ప్రాంతం లోను బ్యాచ్ లు గా వ్రతాలు

* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాజమండ్రి కలెక్టరేట్ లో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా.. శనివారం ఉదయం 10 గంటల నుండి “వికాస” ఆధ్వర్యంలో జాబ్ మేళా..

* తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ నందు వనం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్‌.. నిడదవోలు పట్టణం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు వనం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.

* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా వెలసిన కొల్లాపురమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.

* శ్రీ సత్యసాయి : పెనుకొండలోని జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.

* అనంతపురం : గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సామూహిక వరలక్ష్మి వ్రతం.

* నేడు ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం..

* పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండలం బేతపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన వన మహోత్సవం  కార్యక్రమంలో పాల్గొనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..

* విజయవాడ: ముంబై నటి కాదంబరీ జత్వానీ నేడు నగరానికి వచ్చే ఛాన్స్.. ఐపీఎస్ అధికారులు తనను తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేసిన జత్వానీ.. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో నేడు నగర సీపీ రాజశేఖర్ బాబుని కలుస్తారని సమాచారం.. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న జత్వానీ.

* గుంటూరు: రేపు బాలకుటీర్ విద్యాలయానికి లీజు పొడిగించే అంశంపై ,కౌన్సిల్ ప్రత్యేక సమావేశం..

* మైదుకూరు : మైదుకూరు మునిసిపల్ కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

* విజయనగరం జిల్లా: బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వనం–మనం కార్యక్రమం.. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం నుంచి స్వామి వారి వీధి మీదుగా పార్కు వద్దనున్న రాని మల్లమ్మ దేవి చెరువు వరకు సైకిల్ ర్యాలీ.. అనంతరం చెరువు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమం..

* విజయనగరం: నేడు డెమకాడలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,529 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,730 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు

* విజయవాడ: నేడు బీజేవైఏం రాష్ట్ర స్థాయి సమావేశం.. హాజరుకానున్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి

Show comments