NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: నేటి నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు.. జూనియర్‌ కాలేజీలకు 3 నుంచి 13 వరకు సెలవులు.. అన్ని పాఠశాలలు అకడమిక్ క్యాలెండర్ పాటించాలన్న ప్రభుత్వం.. పాటించని స్కూళ్లపై చర్యలుంటాయన్న ప్రభుత్వం.

* ప్రకాశం : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పర్యటన వివరాలు.. ఉదయం 7 గంటలకు సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఉ 9.30 గం. ఒంగోలులో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.. 10.30 గం.లకు మర్రిపూడిలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కును పరిరక్షించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజుల నిరసన కార్యక్రమాలు..

* ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..

* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అన్నీ ప్రాంతాల్లో గ్రామ సభలు..

*నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు..

* కాకినాడ: రత్నగిరిపై రేపటి నుంచి దసరా ఉత్సవాలు.. తొమ్మిది రోజులపాటు వనదుర్గ కనకదుర్గ అమ్మవారులకు ప్రత్యేక పూజలు.. విజయదశమి రోజున చండీ హోమం పూర్ణాహుతి, సాయంత్రం శమీ పూజ

* విజయవాడ: ఇవాళ దసరా ఏర్పాట్లు పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తుది రివ్యూ.. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు..

* అనంతపురం : విశాఖఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐటియూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష.

* తూర్పుగోదావరి జిల్లా: నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ నందు ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌..

తూర్పుగోదావరి జిల్లా: గాంధీ జయంతి సందర్భంగా ది ఆంధ్ర ప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట ప్రకారం షాపులకు సెలవు.. వ్యాపారస్తులు తమ తమ షాపులను మూసివేయవలసిందిగా తెలియజేయడమైనది-ఆకుల శ్రీనివాస్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి.

* నేటి నుండి రెండు రోజుల పాటు గుంటూరులో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు లాలాపేట సిగ్నల్స్ సెంటర్‌లో గాంధీ జయంతి సందర్భంగా, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న కేంద్ర మంత్రి పెమ్మసాని….

* విశాఖ: ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన… అంబేద్కర్ సర్కిల్ నుంచి GVMC ధర్నా చౌక్ వరకు ర్యాలీ…

* గుంటూరు: సిద్ధార్థ గార్డెన్స్ లో నేటి నుంచి చేనేత వస్త్ర ప్రదర్శన… ప్రదర్శన ను ప్రారంభించనున్న జౌళి శాఖమంత్రి సవిత…

* గుంటూరు: నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, కార్పొరేషన్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని , మేయర్ మనోహర్ ,తదితర వైసీపీ నేతలు..

* విశాఖ: నేడు PCC అధ్యక్షురాలు YS షర్మిల పర్యటన .. GVMC దగ్గర గాంధీ జయంతి కార్యక్రమం లో పాల్గొనున్న షర్మిల.. సాయంత్రం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షల శిబిరంకు వెళ్లి సంఘీభావం ప్రకటించనున్న షర్మిల

* గుంటూరు: నేడు మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ,మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేనేత కార్మికుల ,సంఘాల ధర్నా….

* విశాఖ: నేటి నుంచి స్టీల్ ప్లాంటు కోసం సత్యాగ్రహ దీక్షలకు రాష్ట్ర జేఏసీ పిలుపు.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద ప్రారంభం కానున్న దీక్ష

* తిరుమల: రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఎల్లుండి ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు.. ఎల్లుండి శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ఎల్లుండి రాత్రి పెద్దశేష వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు

* పల్నాడు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, సత్యాగ్రహ దీక్ష…

* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోని ప్రాయశ్చిత దీక్షను విరమించునున్న పవన్‌ కల్యాణ్‌.. దర్శనాంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్న పవన్.. అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల తయారీని పరిశీలించి, అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనున్న పవన్.. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాని స్వీకరించనున్న డిప్యూటీ సీఎం.. లడ్డూ ప్రసాదం తయారు చేసే బూందీ పోటుని పరిశీలించే అవకాశం..

* పశ్చిమ గోదావరి: భీమవరం మున్సిపల్ ఆఫీసులో గాంధీజీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా ముగింపు కార్యక్రమం.. హాజరు కానున్న కేంద్ర మంత్రి శ్భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు..

* గుంటూరు: విశాఖ ఉక్కు ,ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష.

* చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అన్నీ ప్రాంతాల్లో గ్రామ సభలు..

* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…

* విజయనగరం: మహాత్మా గాంధీజీ జయంతి సందర్భగా నేడు NCS వద్ద మహాత్ముని విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా బి.ఆర్.అంబేద్కర్, స్థానిక శాసన సభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు నివాళులు అర్పిస్తారు. అనంతరం నగరంలోని పారిశుద్ధ్య కార్మికులను సత్కరిస్తారు.

* విజయనగరం రూరల్ మండలం ద్వారపూడిలో గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. అక్కడ గ్రామీణ పారిశుద్ధ్య కార్మికుల సత్కార కార్యక్రమంలో పాల్గొంటారు .. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు

* నేడు మచిలీపట్నంతో సీఎం చంద్రబాబు పర్యటన. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..

* ఏలూరు : నేడు ద్వారకాతిరుమలలో పర్యటించనున్న రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి.. ద్వారకాతిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ

* తిరుపతి: రేపటి నుంచి 12వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

* ఏలూరు: రేపు పోలవరంలో PPA సీఈఓ అతుల్ జైన్ పర్యటన.. ఎగువ, దిగువ కాపర్ డ్యాంల మధ్య సీపేజీ నివారణకి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి.. శుక్రవారం రాజమండ్రిలో జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష..

Show comments