* నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన … 11.10 గంటలకు పరవాడ ఫార్మాసిటీ కి చేరుకోనున్న సీఎం.. లారస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఫోటో ఎగ్జిబిషన్.. 12.20కి వెన్నెల పాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం… 12.45 నుంచి 12.55 వరకు మీడియా బ్రీఫ్.. పరవాడ నుంచి రుషికొండ వెళ్లనున్న చంద్రబాబు… 500 కోట్లతో గత ప్రభుత్వం నిర్మించిన విలాస భవనలను పరిశీలించనున్న సీఎం.. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్ష..
* నేటి నుంచి భద్రాచలం రామాలయంలో కార్తీక మాస పూజలు, 4 సోమవారాలు గోదావరికి నది హారతులు.. 11న శివకాయాంలో చందనోత్సవం.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరంలో నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం. డిసెంబర్ 1 వరకు నెల రోజులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు. ఆలయంలో లక్షబిల్వార్చన పూజలకు ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ప్రతిరోజు సాయంత్రం సాముహిక దీపాలంకరణ. కార్తీకమాసంలో 4న, 11, 18, 25న, కార్తీక పౌర్ణమి15 న ఆలయంలో సాముహిక సహస్ర దీపాలంకరణ సేవ. 12 నుండి 15 వరకు పంచరత్నాల్లో భాగంగా గోదావరి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్న అధికారులు. 14న వైకుంఠ చతుర్దశి సందర్భంగా రాత్రి 11గం. స్వామివార్లకు క్షీరాభిషేకం,లింగోధ్బవ పూజ. 15 న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం సత్యనారయణస్వామి వ్రతం, రాత్రి 7 గంటలకు జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించనున్న అర్చకులు.
* జగిత్యాల జిల్లా : నేటి నుంచి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం.. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో గంగా హారతి.. ప్రతి రోజు ఉగ్ర యోగ లక్ష్మీ నరసింహస్వామి వార్లకి ప్రత్యేక పూజలు అభిషేకాలు
* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటినుండి నెలరోజుల పాటు కార్తీక మాసం ప్రత్యేక పూజలు.. నాలుగు సోమవారాలు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన.. 15న కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణం, రాత్రి మహా పూజ .. కార్తీక మాసం నెలరోజుల పాటు రాజన్న ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం సామూహిక కార్తీక దీపోత్సవం
* మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు.. విశాఖ కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొననున్న మంత్రి స్వామి..
* నెల్లూరు : లింగసముద్రం మండలం మేదరమెట్లపాలెంలో గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొననున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు..
* ప్రకాశం : కొమరోలు మండలం ద్వారకచర్లలో గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొననున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..
* చీమకుర్తి మైనింగ్ ఏరియాలో పర్యవేక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఆర్ కృష్ణయ్య, సంతనూతనపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ..విశాఖపట్నంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి, సంబేపల్లి, గాలివీడు మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం.. రాజమండ్రిలో. భక్తులతో కిటకిటలాడుతున్న స్థాన ఘట్టాలు.. గోదావరి నదిలో వేలాదిగా విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. భక్తుల పుణ్య స్నానాలతో పులకిస్తున్న గోదావరి
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో నూతనంగా నిర్మించిన బీసీ హాస్టల్ కాంపౌండ్ వాల్ ను ప్రారంభించనున్న మంత్రి సవిత.
* తిరుపతి: నేడు నగరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన.. చెన్నారెడ్డి కాలనీలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్న మంత్రి… అనంతరం తిరుమల పయనం
* ప.గో: మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన వివరాలు.. యలమంచిలి మండలం ఆడవిపాలెం గ్రామంలో గుంతలు లేని రహదారులు కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు – దొడ్డిపట్ల రహదారి మర్మత్తు పనులు ప్రారంభిస్తారు ..
* ప.గో: పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ.. నేటి నుండి కార్తీకమాసం ప్రారంభ సందర్భంగా తెల్ల వారు జామున 4 గంటల నుండి భక్తులకు స్వామి వారి దర్శనం
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
* పశ్చిమ గోదావరిఐ భీమవరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. మధ్యాహ్నం భీమవరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించనున్న మంత్రి
* విజయనగరం: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు…
* గుంటూరు జిల్లా: నేడు తెనాలిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన… ఇటీవల హత్యకు గురైన (సహానా ) మృతురాలి కుటుంబ సభ్యులకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ,పది లక్షల రూపాయలు చెక్కును అందజేయనున్న, మాజీ మంత్రి అంబటి రాంబాబు…
* నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, వైసిపి నగర కమిటీ ప్రమాణస్వీకారం.. హాజరు కానున్న మాజీ మంత్రులు, వైసిపి ముఖ్య నేతలు..
* నంద్యాల: నేటి నుండి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ అభిషేకాలు నిలుపుదల.. కార్తీక శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు రద్దు.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి
* కర్నూలు: నేడు కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో యురేనియం తవ్వకాలపై భారీ ఎత్తున నిరసన.. కప్పట్రాళ్ల చెన్న కేశవ స్వామి కోనకు పలు గ్రామాల నుంచి తరలి రానున్న జనం.. నిరసనలో పాల్గొననున్న ఎమ్మెల్యే విరుపాక్షి
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,785 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,753 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.38 కోట్లు